చిరంజీవితో కొరటాల శివ

Megastar Chiranjeevi and Koratala Siva to team up

ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు పదునైన సంభాషణలు రాసి రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ ‘మిర్చి’తో దర్శకుడుగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాలు కమర్షియల్‌గా భారీ విజయాల్ని నమోదు చేసుకున్నాయి. కొరటాల శివ చేయబోయే తదుపరి సినిమా గురించి సినీ వర్గాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. హీరో చిరంజీవితో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉందని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ విషయం గురించి చిరంజీవిగానీ, కొరటాల శివగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరూ ప్రకటించకపోయినా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా మాత్రం ఉంటుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంలో భాగంగానే కొరటాల శివ... చిరంజీవి కోసం ఓ సోషల్ మెసేజ్‌తో కూడిన కథను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సమ్మర్‌లో చిరంజీవి, కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. 

సంబంధిత వార్తలు