వీడియో: బంగారం షాపులోకి దొంగలు.. యజమాని ఫైటింగ్..

Updated By ManamThu, 07/05/2018 - 17:44
On CCTV, Hyderabad Jewellery Shop, Owner Fights Off, Robber Couple
  • సీసీ కెమెరాలో ఫుటేజ్ వెలుగులోకి.. 

On CCTV, Hyderabad Jewellery Shop, Owner Fights Off, Robber Coupleహైదరాబాద్: ఓ జ్యూలరీ షాపులోకి కస్టమర్లలా చొరబడిన దొంగలిద్దరితో షాపు యజమాని పొట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సంగారెడ్డి, బీరంగూడలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డిలోని బీరాంగూడలో జైరాం అనే వ్యక్తికి జైభవానీ అనే జ్యూలరీ షాపు ఉంది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బుర్ఖా ధరించిన మహిళ (భార్యభర్తలు) ఒక వ్యక్తి షాపులోకి చొరబడ్డారు. బంగారం కొనేందుకు వచ్చినట్టు నటిస్తూ వేరైటీ నగలను చూపించమని అడిగారు. ఆ యజమాని వేరైటీ జ్యూలరీని తెచ్చేందుకు లోపలికి వెళ్లడంతో అతనివెంటే ఈ ఇద్దరు దొంగలు వెళ్లారు. వెంటనే అతని దృష్టిని మరల్చి విలువైన బంగారం, నగదు దోచుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన జైరాంను వారిని ప్రతిఘటించాడు.

అంతలో బొమ్మ తుపాకీ తీసి కాల్చుస్తామంటూ బెదిరించారు. బుర్ఖా ధరించిన మహిళ షాపు యజమానిని వెనుక నుంచి కర్రతో కొట్టింది. దాదాపు పదినిమిషాల పాటు దొంగలైన భార్యభర్తలిద్దరూ జ్యూలరీ షాపు యజమాని జైరాం మధ్య పోట్లాట కొనసాగింది. బుర్ఖా ధరించిన మహిళ జైరాం కళ్లలో కారం కొట్టడంతో అతడు వారిని నిలవరించలేకపోయాడు. ఈ క్రమంలో దొంగలిద్దరూ షాపులో రూ.25 లక్షల విలువైన బంగారంతోపాటు రూ.4 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడు జైరాంను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

English Title
On CCTV, Hyderabad Jewellery Shop Owner Fights Off Robber Couple
Related News