మహిళను తాకుతూ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెకిలి చేష్టలు.. 

Updated By ManamWed, 06/20/2018 - 19:16
Caught On Video, Railway Cop, Trying To Touch Woman, Station, Suspended
  • రైల్వేస్టేషన్‌లో మహిళకు కానిస్టేబుల్ వేధింపులు.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు

  • ముంబైలోని కల్యాణ్ రైల్వేస్టేషన్‌లో ఘటన.. వీడియో వైరల్

  • స్పందించిన రైల్వే అధికారులు.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్ 

Caught On Video, Railway Cop, Trying To Touch Woman, Station, Suspendedముంబై: రైల్వే స్టేషన్‌ల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రయాణికులకు రక్షణ కల్పించాల్సిన ఆర్‌పీఎఫ్ (రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్‌ ఓ మహిళ పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై  వేచివున్న మహిళను అక్కడి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అసభ్యంగా తాకుతూ లైంగిక వేధించాడు. ఈ ఘటన ముంబైలోని జహన్‌గిర్ కల్యాణ్ పోలీసు స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే విచారించి సదరు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌‌ను సస్పెండ్ చేశారు. రైల్వేస్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పక్కనే కూర్చొన్న మహిళను వెనుక నుంచి ఆమె భుజాలు నొక్కుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కానిస్టేబుల్ వెకిలి చేష్టలను గమనించిన కొందరు ప్రయాణికులు అతన్ని చుట్టుముట్టారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన కానిస్టేబుల్‌ను ప్రయాణికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు.

ఇదంతా అక్కడి ప్రయాణికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అయితే దీనిపై విచారణ జరిపి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని డివిజినల్ కమిషనర్ సెంట్రల్ రైల్వేస్ సచిన్ భలేడ్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వీడియో ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. రైల్వేస్టేషన్ వద్ద మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని, పరిసర ప్రాంతాల్లో ఒక మహిళా పోలీసు అధికారి నేతృత్వంలో ఐదు మహిళా శక్తి టీమ్స్‌ నిరంతరం గమనిస్తూనే ఉంటారని తెలిపారు.

English Title
Caught On Video: Railway Cop Trying To Touch Woman At Station, Suspended
Related News