వీడియో: 11 ఉల్లిగడ్డలు మింగిన నాగుపాము!

Updated By ManamTue, 07/03/2018 - 17:42
Caught On Camera, Cobra Swallows, Throws Up, 11 Onions, Odisha

Caught On Camera, Cobra Swallows, Throws Up, 11 Onions, Odishaభువనేశ్వర్: ఇప్పటివరకూ పాములు గుడ్లు మింగడమే చూశాం.. కానీ, ఉల్లిగడ్డలను కూడా మింగుతాయని తెలుసా? అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తే అవుననే అంటారు. బాగా ఆకలితో ఉన్న నాగుపాము ఒకటి ఏకంగా 11 ఉల్లిగడ్డలను మింగేసింది. ఈ ఘటన ఒడిసాలోని అంగుల్ జిల్లా, చెండిపాడ గ్రామంలో చోటుచేసుకుంది. సుశాంత్ బెహారా అనే వ్యక్తి ఇంటి ఆవరణంలో నాగుపామును గుర్తించిన వెంటనే స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్ హిమాన్షు శేఖర్ దెహురికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకొన్న హిమాన్షు నాగుపామును రక్షించాడు. అప్పటికే పదకొండు ఉల్లిగడ్డలతో పాటు ఓ కప్పను కూడా మింగిన నాగుపాము వాటిని జీర్ణించుకోలేక బయటకు నెమ్మదిగా కక్కేసింది.

చివరిగా రెండు ఉల్లిగడ్డలను నాగుపాము బయటకు కక్కుతుండగా వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్నేక్ హెల్ప్‌లైన్ హిమాన్షు స్పందిస్తూ.. ‘‘నాగుపాము మింగిన ఉల్లిగడ్డలను కక్కడం చూశాను. ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీయమని నా స్నేహితుడికి చెప్పాను. చివరిగా నాగుపాము కక్కిన రెండు ఉల్లిగడ్డలను మాత్రమే వీడియో తీయగలిగాం’’ అని హిమాన్షు చెప్పారు. 

ప్రపంచంలో ఇదే తొలి కేసు.. 
నాగుపాము ఏకంగా 11 ఉల్లిగడ్డలను మింగేసిన కేసు నమోదు కోవడం ప్రపంచంలో ఇదే తొలిసారిగా స్నేక్ హెల్ప్‌లైన్ జనరల్ సెక్రటరీ సుభేందు మల్లిక్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో ఓ నాగుపాము ఏకంగా ఏడు గుడ్లను మింగిన అనంతరం వాటిని జీర్ణించుకోలేక గుడ్లను బయటకు కక్కిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

English Title
Caught On Camera: Cobra Swallows, Throws Up 11 Onions In Odisha
Related News