ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ రచయిత

Updated By ManamThu, 07/12/2018 - 10:56
alok

Alok అవకాశాలు లేక మరో బాలీవుడ్ యువ రచయిత ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. నానా పటేకర్ నటించిన ‘అబ్ తక్ చప్పన్’ చిత్రానికి రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ బుధవారం రాత్రి ముంబైలోని ఓ భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పై నుంచి పడటంతో అలోక్ అక్కడికక్కడే మరణించాడు.

అయితే పశ్చిమ అంధేరిలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అలోక్.. సినిమా అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సైకియాట్రిక్ చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అలోక్ వద్ద కానీ, అతని ఇంట్లో కాని ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

English Title
Bollywood writer Ravi Shankar Alok committed suicide
Related News