కనిపించిన పెద్దపులి

Big tiger
  • కవ్వాల్ అభయారణ్యంలో ఏడాది తర్వాత కెమెరా కంటికి

నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్, కడెంరేంజ్లో ఉన్న కవ్వాల్ అభయారణ్యంలో పెద్దపులి కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు దాదాపు ఏడాది విరామం తర్వాత చిక్కింది.  కొన్నాళ్లుగా అడపా దడపా పులి సంచారం కనిపిస్తున్నా, కవ్వాల్ పరిధిలో పులుల శాశ్వత ఆవాసానికి అనువుగా పరిస్థితులు లేవన్న వాదనలు ఉన్నాయి.  అయితే కొంత కాలంగా కవ్వాల్ కోర్ ఏరియాలో అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మానవ సంచారం, చెట్లు కొట్టడం, పెంపుడు జంతువులు మేపటాన్ని అటవీ శాఖ నిషే దించింది. సుమారు 22 వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో, ఐదు వేల హెక్టార్లను వివిధ గ్రామాల ప్రజలకు, పశువులు, గొర్రెల పెంపకానికి అనుమతిని ఇచ్చి, మిగతా ప్రాంతంలో పూర్తిగా నియంత్రణను అమలు చేశారు. సమీప గ్రామ ప్రజల్లో ఆ దిశగా చైతన్యం కూడా అటవీ శాఖ తీసుకువచ్చింది. కోర్ ఏరియా ప్రాంతంలో సహజ గడ్డి క్షేత్రాల పెంపునకు అటవీ శాఖ ప్రాధాన్యతను ఇచ్చింది. జంతువుల కోసం తాగునీటి వసతిని కూడా పెంచింది. దీంతో శాఖాహార జంతువుల ఆవాసం, సంఖ్య బాగా పెరిగింది. వీటిపై ఆధారపడే మాంసాహార జంతువుల సంఖ్య కూడా కొంత కాలంగా పెరుగుతూ వస్తోంది. ఇక కోర్ ఏరి యాలో ఉన్న గ్రామాల తరలింపు కూడా ఓ కొలిక్కి వచ్చింది. పైలట్ ప్రాజె క్టులో భాగంగా రాంపూర్, మైసంపేట గ్రామాల తరలింపునకు స్థానికులు అంగీకరించటంతో, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల నిధుల విడుదలతో పాటు, తరలింపుకు ఆమోదం తెలిపింది. ఇలా వరుసగా అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటంలో భాగంగానే కవ్వాల్‌లో పులులు, చిరుతలతో పాటు శాఖాహార జంతువుల సంఖ్య, సంచారం కూడా పెరిగిందని, ప్రస్తుతం కనిపించింది. ఆరోగ్యంగా ఉన్న మగ పులి అని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్ డైరెక్టర్ సి. శరవ నన్ తెలిపారు. పులి జాడ అటవీ శాఖ అధికారులు, సిబ్బందిలో సంతోషాన్ని నింపింది. కవ్వాల్ ప్రాంతం పులులకు శాశ్వత అవాసంగా ఉండేలా మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని,స్థానిక గ్రామాల ప్రజలతో నిత్యం సంప్రదిం పులు జరుపుతూ, పెంపుడు జంతువులు, మనుషుల సంచారాన్ని పూర్తిస్థాయి లో నివారించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కె.ఝా ఆదేశించారు.

Tags

సంబంధిత వార్తలు