బిగ్ బి పెద్ద మనసు

Updated By ManamSun, 10/21/2018 - 09:59
Amithab

imageసినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. అప్పులతో సతమతమవుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు అమితాబ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ ఆయన ప్రకటించారు. ‘‘యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను మేము గుర్తించాం. వారి మొత్తం రణాలు రూ.5.5 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిసింది. మనకోసం త్యాగాలు చేస్తున్న రైతన్నలను ఆదుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్, విదర్భకు చెందిన రైతుల రుణాలను మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రైతుల రుణాలు తీర్చాలనుకుంటున్నాను’’ అని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా కెబిసి కరంవీర్‌లో కనిపించిన అజీత్‌సింగ్‌కు కూడా సాయం అందచేస్తానని అమితాబ్ తెలిపారు. ఎంతో మంది యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశారు. వారంతా చాలా దురేరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి పునరావాసం, రక్షణల కోసం పాటుపడుతున్న అజీత్‌సింగ్‌కు చెక్కును పంపనున్నట్లు అమితాబ్ ప్రకటించారు.

English Title
Big B.. big mind
Related News