'అవెంజ‌ర్స్ - ఇన్ఫినిటీ వార్‌' వ‌సూళ్ళ వ‌ర్షం

Updated By ManamSun, 04/29/2018 - 22:56
ave

avengersమార్వెల్ స్టూడియోస్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ హాలీవుడ్ మూవీ 'అవెంజ‌ర్స్ - ఇన్ఫినిటీ వార్‌'.. ఈ శుక్ర‌వారం విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌కు గానూ ఈ సినిమా నార్త్ అమెరికాలో 250 మిలియ‌న్  డాల‌ర్లు రాబ‌ట్ట‌గా.. రెస్ట్ ఆఫ్ వ‌ర‌ల్డ్ 380 మిలియ‌న్ డాల‌ర్లను.. అంటే మొత్తంగా 630 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఆర్జించింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా రాబ‌ట్టింద‌ని స‌మాచారం. టైటాన్ గ్ర‌హానికి చెందిన‌ థానోస్ అనే అత్యంత శ‌క్తిమంతుడైన దుష్టుడిని సూప‌ర్ హీరోలంద‌రూ క‌లిసి ఎలా ఎదుర్కొన్నారు అనే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. తెలుగు వెర్ష‌న్ కోసం థానోస్ పాత్ర‌కి రానా చెప్పిన డ‌బ్బింగ్ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

English Title
'avengers - infinity war' collections
Related News