భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే

Updated By ManamThu, 11/08/2018 - 18:25
Australia, Mitchell Starc, Nathan Lyon, T20 squad, India

Australia, Mitchell Starc, Nathan Lyon, T20 squad, Indiaసిడ్నీ: భారత్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు 13మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఆరోన్‌ పింఛ్‌ సారథ్యంలో సిరీస్ ప్రారంభం కానుంది. భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు, ఈ నెల 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి కూడా ఇదే జట్టుని ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌, స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, వెటరన్‌ పేస్‌ బౌలర్‌ పీటర్‌ సిడిల్‌కు చోటు కల్పించలేదు. తాజాగా ప్రకటించిన జట్టులో పేస్‌ బౌలర్‌ జోసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ తిరిగి చోటు దక్కించుకున్నాడు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో అతనితో పాటు నాథన్‌ కౌల్టర్‌-నైల్‌, బిల్లే స్టాన్‌లేక్‌, ఆండ్రూ టై ఆడనున్నారు. 

ఆసీస్‌ జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్), ఆలెక్స్‌ కారే(వైస్‌ కెప్టెన్‌), అష్టన్‌ అగర్‌, జోసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, నాథన్‌ కౌల్టర్‌-నైల్‌, క్రిస్‌ లియన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, బెన్‌ మెక్‌డర్మోట్‌, డీఆర్చీ షార్ట్‌, బిల్లే స్టాన్‌లేక్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆండ్రూ టై, ఆదామ్‌ జంపా.

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

English Title
Australia Mitchell Starc, Nathan Lyon out of T20 squad against India
Related News