హేమమాలిని అంటే అటల్‌జీకి పిచ్చి అభిమానం!

Updated By ManamFri, 08/17/2018 - 08:48
Vajpayee

Vajpayeeన్యూఢిల్లీ: అటల్ జీ తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆయన జీవితంలో ఎవరూ తెలియని ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. ఇప్పటి వరకూ మనకు అటల్ జీ అంటే మంచి వక్త, కవి, ప్రజా నాయకుడు, మంచి ప్రధాని అని మాత్రమే తెలుసు. అయితే ఆయన మంచి సినీ ప్రియుడు కూడా అని డ్రీమ్ గాళ్ హేమమాలిని ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.

హేమమాలిని నటన గురించి కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా డ్రీమ్ గాళ్ నటించిన ‘సీత ఔర్ గీత’ సినిమాను వాజ్‌పేయి ఒకట్రెండు సార్లు ఏకంగా 25 సార్లు చూశారంటే అర్థం చేస్కోండి ఆయనెంత సినీ ప్రియుడు.. ఆ సినిమా ఎంతగా నచ్చిందో. అంతేకాదు హేమమాలిని అంటే అటల్‌జీకి పిచ్చి అభిమానం.

హేమమాలిని మాటల్లోనే..
" నేను ఫస్ట్ టైం వాజ్‌పేయి గారిని కలిసినప్పుడు ఆయన నాతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిపడ్డారు. ఏం మాట్లాడాలో పాపం ఆయనకే అర్థం కాలేదు. అలా మా భేటీ సాగింది. ఆయన్ను కలిసి బయటికొచ్చిన తర్వాత అటల్ జీ సిబ్బంది చెప్పిన మాటలకు నేను చాలా ఆశ్చర్యపోయాను. 1972 రిలీజ్ అయిన మీ సినిమా ‘సీత ఔర్ గీత’ ను 25 సార్లు చూశారు. వాజ్‌పేయిగారు మీకు వీరాభిమాని అని ఆఫీస్ సిబ్బంది నాకు చెప్పారు. ఈ మాటలు విన్న నేను ఒకింత షాకయ్యాను" అని గతేడాది ఓ ఇంటర్వ్యూలో డ్రీమ్ గాళ్ చెప్పారు. 

English Title
Atal Bihari Vajpayee is a big fan of Hema Malini
Related News