20 సీట్లు కోరండి

Updated By ManamFri, 11/09/2018 - 06:18
babu
  • ఎల్బీనగర్ సీటుకై బాబు కాళ్లు పట్టుకున్న కార్యకర్తలు

  • గతంలో తాము గెలిచిన స్థానాలకై పట్టు

babuఅమరావతి: తెలంగాణలో పోటీ చేసే సీట్ల విషయంపై చర్చించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. గురువారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు ఆపార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ తదితర నేతలు బాబు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితాను బాబుకు అందించారు. మహాకూటమిలో టీడీపీకి 14 సీట్లు కాకుండా 20 సీట్లు అడగాలని నేతలు బాబును కోరారు. గతంలో టీడీపీ గెలిచిన స్థానాలను టీడీపీకే కేటాయించేలా చూడాలన్నారు. కూటమికి ప్రజల ఆమోదం ఉండడంతో టీడీపీని టీఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. ఈ సందర్భంగా బాబు టీటీడీపీ నేతలకు పలు సూచనలు చేశారు. మహాకూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. గెలిచే స్థానాలనే కొర దామని, ఒకటి రెండు చోట్ల సర్దుకోక తప్పదని చెప్పారు. కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నేత హనుమంతరావు ఈ భేటీలో చంద్రబాబును కలిశారు. ఎల్బీనగర్ నుంచి సామా రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నేత భీంరెడ్డి ఎల్బీనగర్ టికెట్ టీడీపీకే వచ్చేలా చూడాలని కార్యకర్తలు బాబు కాళ్లు పట్టుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ స్థానంపై చంద్రబాబు వద్ద ఎడతెగని చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బదులు ఖైరతాబాద్ ఇస్తామనడంపై అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్ ఇబ్రహీంపట్నం స్థానా లపై పట్టుబట్టాలని నేతలు నిర్ణయిం చినట్లు సమాచారం. రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీపై కూడా సందిగ్ధిత కొనసాగుతోంది. రావుల పోటీకి సిద్దమై తే దేవరకద్రను కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ సీరియర్లు అరవిం ద్ కుమర్, పాల్వాయి రజనీ కుమారీ, శోభారాణితో పాటు పలువురు అశావాహాలు బాబుతో టికెట్ కేటాయించాలిని కోరారు

కూటమిని చూస్తే కేసీఆర్‌కు భయం: రమణ
మహాకూటమిని చూస్తే తెరాసకు భయమేస్తోందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.  చంద్ర బాబుతో సమా వేశనంతరం ఆయన మాట్లా డుతూ మహా కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చిం చామన్నారు. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని, తమకు సీట్లు ముఖ్యం కాదని, గెలుపు ముఖ్య మని రమణ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని రమణ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, తెరాసను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. కేంద్రంలో నియంతృత్వ సర్కారును గద్దె దించేందుకు చంద్రబాబునాయుడు నడుం బిగించారని... దీనిలో భాగంగానే ఆయన భాజపాయేతర పార్టీలను ఏకం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. ప్రస్తుతం మరోసారి ఆయన జాతీయ రాజకీయాలను శాసిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వచ్చిందని... ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన వస్తుందన్నారు.

సర్దుబాటు పూర్తయింది: రావుల
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తి అయ్యిందని, అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బాబుతో భేటీ అనంతరం రావుల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అంటే భయం కనుకే తమ పార్టీపై కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మహా కూటమి ఏర్పాటుకు కేసీఆరే కారణమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శించారని ఆరోపించారు. టీడీపీ వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్‌కు దళితులు, మహిళలు కనిపించలేదా అని ప్రశ్నించారు. 

టీడీపీ ప్రతిపాదిత అభ్యర్ధులు
సత్తుపల్లి     వెంకట వీరయ్య
అశార్వాపేట    మచ్చా నాగేశ్వరరావు
ఉప్పల్    వీరేందర్ గౌడ్
కోదాడ    మల్లయ్య యాదవ్
సికింద్రబాద్    కోనా వెంకటేశ్ గౌడ్/
    సమా సారంగా పాణి
ఖైరతాబాద్    దీపక్ రెడ్డి/బీఎన్ రెడ్డి
కూకట్ పల్లి    పెద్దిరెడ్డి/మందాడి 
    శ్రీనివాసరావు
శేరలింగంపలి    అనంద్ ప్రసాద్/ 
    మువ్వా సత్యనారాయణ
రాజేంద్రనగర్     గణేశ్ గుప్తా/ 
    సామా భూపాల్ రెడ్డి
ఖమ్మం    నామా నాగేశ్వర్ రావు
మక్తల్    కొత్తకోట దయాకర్ రెడ్డి
చార్మినార్     మస్కటీ

English Title
Ask for 20 seats
Related News