ఊహించని ట్విస్ట్.. ఆమె...

Updated By ManamWed, 06/13/2018 - 16:32
Arman Kohli Case Turns Around: Court Rejects Bail Plea, His Lover Withdraws Case
  • నటుడు అర్మాన్ కోహ్లీకి బెయిల్ రిజెక్ట్.. కేసు వాపస్ తీసుకున్న నీరూ

Arman Kohli Case Turns Around: Court Rejects Bail Plea, His Lover Withdraws Caseగాళ్ ఫ్రెండ్‌ను హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్‌ మాజీ పోటీదారు అర్మాన్ కోహ్లికి బాంద్రా కోర్టు ఈ 26 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి  ఆదేశించింది. అంతేకాకుండా అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. గర్ల్‌ ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో అర్మాన్‌ కోహ్లిని ముంబై పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత వారమే శాంతాక్రజ్‌ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అర్మాన్ సిమ్ కార్డు కొనేందుకు వచ్చి పోలీసులకు చిక్కాడు.

అయితే ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. అర్మాన్ అరెస్ట్ అనంతరం అతడిపై పెట్టిన వేధింపుల కేసును ప్రియురాలు నీరూ రాంధవా వెనక్కి తీసుకోవటం విశేషం. ఈ సందర్భంగా అర్మాన్ తరఫు న్యాయవాది లక్ష్మి రామన్ మాట్లాడుతూ.. ‘అర్మన్-నీరూ రాంధవా మధ్య వివాదం పరిష్కారం అయింది. ఇక అర్మాన్ జ్యుడిషియల్ కస్టడీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని అన్నారు. కాగా అర్మాన్ కోహ్లి ఇప్పటికే బాంబే హైకోర్టులో పరస్పర అంగీకారం ద్వారా ఫిర్యాదును రద్దు చేయలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అర్మాన్‌ కోహ్లి, నీరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వివాదం నెలకొనడంతో నీరూను దారుణంగా హింసించిన విషయం తెలిసిందే.

English Title
Arman Kohli Case Turns Around: Court Rejects Bail Plea, His Lover Withdraws Case
Related News