నా వ్యాఖ్యలు వివాదాస్పదం చేశారు

Updated By ManamFri, 08/10/2018 - 13:09
dalai lama
  • తప్పుగా మాట్లాడితే క్షమించండి :దలైలామా

Dalai Lama

బెంగళూరు : మాజీ ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రుపై తాను చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారని  ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ... ‘నెహ్రుపై ఒకవేళ తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నా. ఇంతటితో ఈ వివాదాన్ని ముగిస్తే మంచిది’ అని అన్నారు. 

కాగా మహమద్ అలీ జిన్నాను ప్రధానమంత్రిని చేస్తే దేశ విభజన జరిగేది కాదని దలైలామా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జిన్నాకు ప్రధాన మంత్రి పదవి ఇవ్వడానికి మహాత్మ గాంధీ సుముఖంగా ఉన్నప్పటికీ నెహ్రూ దీనికి నిరాకరించారన్నారు. ఒకవేళ మహాత్ముడి ఆలోచన అమలు జరిగి ఉంటే భారత్, పాకిస్తాన్ విడిపోయేవి కావంటూ...  గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్  నిర్వహించిన ఓ కార్యక్రమంలో దలైలామా అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో దలైలామా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
 

English Title
Apologise If I said something wrong, says dalai lama
Related News