టెట్ వాయిదా

Updated By ManamWed, 12/27/2017 - 20:20
ap tet, 3 weeks break

​​tetఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)‌ను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో జరగాల్సిన ఈ పరీక్షను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మళ్లీ ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు దీన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించాారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. టెట్‌ వాయిదా ప్రభావం డీఎస్సీ నిర్వహణపై ఉండదన్నారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ తేదీల్లో మార్పులు ఉంటాయని తెలిపారు.

వదంతుల్ని నమ్మొద్దు 
టెట్ ర‌ద్దు చేస్తారంటూ వస్తోన్న వదంతుల్ని అభ్యర్థులెవరూ నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉందన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఫిబ్రవరి 9న పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

English Title
ap tet, 3 weeks break
Related News