ఏపీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు!

Updated By ManamThu, 07/12/2018 - 14:38
AP People Misunderstanding On Congress Said Oommen Chandy

AP People Misunderstanding On Congress Said Oommen Chandy

నెల్లూరు: పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న, పార్టీలో నుంచి బయటికెళ్లిన కీలక నేతలకు మళ్లీ గాలం వేసి రప్పించేందుకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌చార్జ్ ఊమెన్ చాందీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు ఇందిరాభవన్‌‌లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ కంచుకోట ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారాయన. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలను అమలు చేయగలదు అని చాందీ అన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవంతో బీజేపీ ఆడుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
AP People Misunderstanding On Congress Said Oommen Chandy
Related News