ఏపీ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు..

Updated By ManamFri, 11/09/2018 - 16:58
AP cabinet extension, Chandrababu naidu, Minority, ST seats, Kidari sarveswararao, Faruqh son
  • 11న ఉండవల్లి ప్రజావేదికగా మంత్రివర్గ విస్తరణ 

  • ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించే అవకాశం 

  • కేబినెట్‌లో రెండు ఖాళీలు భర్తీ.. పలు శాఖల్లో మార్పులుకు అవకాశం

AP cabinet extension, Chandrababu naidu, Minority, ST seats, Kidari sarveswararao, Faruqh sonఅమరావతి: ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. కేబినెట్‌లో మైనార్టీలు లేని లోటును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భర్తీ చేయనున్నారు. గతకొంత కాలంగా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు. ఉదయం 11.45 గంటలకు ఉండవల్లి ప్రజావేదికగా ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఏపీ కేబినెట్‌లో ప్రధానంగా ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్‌లో ముస్లిం, మైనార్టీలతో పాటు బలహీనవర్గాలకు చంద్రబాబు కట్టబెట్టనున్నారనే టీడీపీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి టీడీపీ వైదొలగడంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా వైదొలిగింది. 

ఈ క్రమంలో మంత్రులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దాంతో కేబినెట్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి దేవదాయ శాఖను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతిలో ఉండగా, వైద్య, ఆరోగ్య శాఖ చంద్రబాబు పర్యవేక్షణలో ఉంది. మంత్రివర్గంలో ఏర్పడిన ఈ రెండు ఖాళీలను మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలోని రెండు ఖాళీలను భర్తీచేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌‌ ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, దివంగత నేత కిడారి సర్వేశ్వరరావు తనయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫరూక్ తనయుడికి మైనార్టీ కింద, కిడారి తనయుడు శ్రవణ్‌కు ఎస్టీ కోటాలో సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఫరూక్‌కు మైనార్టీ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖను ఓ సీనియర్ మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. 

కొన్ని శాఖల్లో మార్పులు?
అయితే ఏపీ మంత్రివర్గం విస్తరణలో రెండు ఖాళీల భర్తీతోపాటు కొన్ని శాఖల్లో మార్పుచేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఎవరి శాఖలను మారుస్తారనేదానిపై టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు తీసుకొనే కీలక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఒకరిద్దరిని కేబినెట్ నుంచి పంపించే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కొందరి నేతల పట్ల చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, వారి భవితవ్యం కూడా మంత్రివర్గ విస్తరణతో తేలిపోనుందని భావిస్తున్నారు. అలా కాకుండా కేవలం ఖాళీ అయిన రెండు మంత్రి పదవులనే భర్తీ చేస్తే మాత్రం.. మైనార్టీ, ఎస్టీ రేసులో కిడారి తనయుడు శ్రవణ్, ఫరూక్ తనయుడు ఉంటారు. వైసీపీ నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ భాషాలను కూడా  ఏపీ కేబినెట్‌లోకి  తీసుకోవడం చంద్రబాబు సరికాదని భావిస్తున్నట్టు సమాచారం.  

English Title
AP cabinet extension to be held on Nov 11
Related News