మరో విలక్షణమైన గెటప్‌లో..

Updated By ManamFri, 11/09/2018 - 03:14
vikram

imageవిలక్షణమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే నటుల్లో విక్రమ్ ఒకరు. ఈయన హీరోగా కమల్ హాసన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషన్ బ్యానర్‌పై ఓ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కడరమ్ కొండన్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో విక్రమ్ జోడిగా కమల్ తనయ అక్షర హాసన్ నటిస్తుంది. కొరియన్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనివార్తలు వినపడుతున్నాయి. ‘చీకటి రాజ్యం’ ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ దర్శకుడు. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడి పాత్రలో కనిపిస్తారు. గతంలో ‘కాశి’, ‘తాండవం’ చిత్రాల్లో విక్రమ్ అంధుడి పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి  శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
 

English Title
Another different getup
Related News