జంతువులూ ‘చట్టపర వ్యక్తులే’ 

Updated By ManamSun, 07/08/2018 - 23:32
animals

రాష్ట్రంలోని జంతువులన్నింటికీ చట్టబద్ధైమెన హక్కులుంటాయని జార్ఖండ్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. హక్కులు, విధులు, బాధ్యతల్లో ప్రత్యేక వ్యక్తిత్వం కలిగివుం టాయని న్యాయస్థానం స్పష్టంచేసింది. జంతువుల పట్ల క్రూరం గా ప్రవర్తించకుండా ఆదేశించాలని దాఖైలెన పిటిషన్‌పై జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ లోకపాల్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ జంతువులకు ఏకైక స్థాయిని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు పశుపక్ష్యాదులతో పాటు జలచరాలకు కూడా వర్తిస్తుంది. ఇటువంటి హక్కులు, వ్యక్తిత్వం గంగానదికి కూడా ఉందని గతంలో జార్ఖండ్ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో మానవ సంబంధిత హక్కులన్నీ నదులు, జంతుజాలాలకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయింది. 

image


జింకల తదితర జంతుజాలాలను వేటాడడం వల్ల ఆ జంతుజాతి నశించిపోవడమే కాకుండా జీవైవెవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూమి మీద ఉన్న  ప్రతిపాణిని కాపాడుకోవలసిన అవసరం ఉంది. భూమి, నీరు, వాయువు, ఆకాశాలను ఇప్పటికే కలుషితం చేసిన ప్రభావం మానవజాతిపై కనిపిస్తోంది. అడపాదడపా క్రూర జంతువులు, ఆహారం కోసం పక్షులను చంపుకు తింటుండడం వల్ల జీవైవెవిధ్యానికి తీవ్ర  నష్టం జరుగుతోంది. భూమి సురక్షితంగా ఉంటే భూమిపై ఉండే జంతుజాలం (మనిషి సహా)తో పాటు నీరు, ఆకాశం కూడా భద్రంగా ఉంటాయి. అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయ డం, అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తల కోసం విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం తదితర చర్యల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. 

కాలిఫోర్నియాలో డెల్టా ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఎంతో కృషి జరుగుతోంది. దాంతో అక్కడ వ్యవసాయాదాయం ఏడాది 1.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మత్స్యసంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ‘అక్వేరియం జూ’ను నిర్వహిస్తున్నారు. అలాగే, బ్రెజిల్‌లో ఆఫ్రికన్ వర్షారణ్యాలను కాపాదేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించిందని చెబుతున్నారు. జంతుజాలాన్ని, చెట్లను కాపాడుతున్న చర్యలతో యాంటి మలేరియా, ఎముకల బలహీనతలు నివారించేందుకు అవసమైన ఔషధాలు తయారుచేసేందుకు ప్రయుత్నిస్తున్నారు.

జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని జార్ఖండ్ హైకోర్టు నొక్కిచెప్పింది. జంతువులను బంధించడం కూడదని న్యాయుస్థానం పేర్కొంది. అంతేగాక, ఉష్ణోగ్రతలు అత్యధికంగా 37 డిగ్రీలు, అత్యల్పంగా ఐదు డిగ్రీలకు చేరుకుంటే బండ్లు లాగేందుకు ఎడ్లు, దున్నపోతులతో పాటు ఇతర జంతువులను ఎవరూ వినియోగించరాదని న్యాయుస్థానం హెచ్చరించింది. జంతువులను రవాణ చేసే వాహనాల్లో ఫ్లూరసెంట్ రిఫ్లెక్టర్లను వాడకూడదని, జంతువులను ఉపయోగించి రవాణ చేసే వాహనాలకు బరువు నియంత్రించవలసిన ఉంటుందని బెంచ్ సూచించింది.

అలాగే గుర్రాలు, ఎడ్లు, దున్నపోతులకు తగినవిధంగా ఆశ్రయం కల్పించాలి. చికిత్స కోసం తమవద్దకు తీసుకొచ్చే, వచ్చిన ప్రతి జంతువుకు పశుైవెద్యులు తప్పనిసరిగా చికిత్స అందిం చాలి. ఇప్పటికే పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ తీర్పు అమలు సక్రమంగా అమలు జరిగితే, జంతుజాలాలు, అన్ని రకాల పశుపక్ష్యాదుల, జలచరాలకు భద్రత లభిస్తుంది. ఫలితంగా జీవైవెవిధ్యానికి కూడా భద్రత కలుగుతుంది. 

English Title
Animals are 'legal people'
Related News