లోకేష్ తో అంబిక లక్ష్మీ నారాయణ భేటీ

Updated By ManamWed, 06/13/2018 - 12:47
lokesh

lokesh, ambika హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. హిందూపురం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అంబిక  లక్ష్మీ నారాయణ హస్తానికి హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆయన బుధవారం సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ను కలిశారు.  జిల్లా పర్యటనకు వస్తున్న లోకేష్ ను అంబిక లక్ష్మీ నారాయణ కోడికొండ సమీపంలో కలిసి, కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా అంబిక లక్ష్మీ నారాయణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీ చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అంతకు ముందు బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్ ను మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తదితరులు కలిసి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఇవాళ మడకశిరలో పర్యటించనున్నారు. అందులో భాగంగా కోడికొండ చెక్ పోస్టు చేరుకున్న  ఆయనకు  జిల్లా, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.

English Title
Ambika Lakshminarayana met Lokesh
Related News