అమానవీయ వ్యాపారాలు ఆపాలి!

Updated By ManamThu, 07/12/2018 - 00:55
image

imageహరీంద్రనాథ్ చటోపాధ్యాయ పేరు చాలామంది వినే ఉంటారు. ఈ యన భారత కోకి ల సరోజనీ నాయు డి సోదరుడు.  వీరి తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ. డి.ఎస్సీ సాధించిన తొలి భారతీయ వైజ్ఞానికుడు. మన హైదరాబాద్‌లోని నిజాం కళాశా లకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వారు. ఆబీద్ రోడ్డు లోని ‘గోల్డెన్ త్రెషోల్డ్’ భవనం ఒకప్పటి వీరి నివా సం. కవులూ కళాకారులూ సామా జిక సమస్యలకు ఎలా స్పందిస్తారో గుర్తుచేయడానికి 25 జులై 1964న బొంబాయి నుంచి వెలువడిన ‘బ్లిట్జ్’ ఇంగ్లీషు పత్రికలో అచ్చయిన హరీంద్రనాథ్ కవితను తెలుగు చేసి చెపుతున్నాను. అప్పటి ఈ కల్తీ ప్రహసనం ఇప్పటికీ సరిపోతుంది. నిత్యావసర వస్తు వులతో మాట్లాడించి ఆయన ‘ఎ స్పైసీ టేల్’ అనే ఈ కవితను సాధించారు. 

‘‘మా ఒళ్ళంతా రాళ్ళతో గాయమవుతూ ఉంటే
అన్నమంతా సున్నమై, జాతి రక్తమాంసాలకు విలువ లేక
అవహేళన చేయబడుతుంటే
ప్రభుత్వాలు మేల్కొనే ఉన్నాయా? లేక,
నిద్రలో జోగుతున్నాయా’’ - అని
ఆవేశంగా ప్రశ్నించాయి బియ్యం, ఇతర ధాన్యాలు!
వ్యాపారస్థుల్ని అని యేం లాభం?
వెనిగర్ ఎసిటిక్ ఏసిడ్ అయ్యిందని
ఉప్పులో చాక్ పొడి కలుస్తుందని
చింత పండును లెడ్ క్రోమేట్ కప్పేస్తోందని
లెడ్ ఆక్సైడ్ ఎర్రకారాన్ని కోరుతుందని
చివరకు, ఆహారాన్ని విషం చేసేది
నల్లబజారు దొంగలేనని... మహాఘనత వహించిన
ప్రభుత్వ - రాజా వారికి తెలియదా?
తెలియదంటే సిగ్గు సిగ్గు ?
తెలిస్తే మరి కక్షలూ, కార్పణ్యాల మాటున
కల్తీలు, కాలుష్యాలు వర్దిల్లాల్సిందేనా?’’ అని
ఆవేదన చెందాయి ఆహార పానీయాలు!!
‘‘ఈ అన్యాయపు పొగదీపాలు ఆర్పేయాల్సిందే!
ప్రభుత్వం చెవిటిదైనా మనం ఊరుకోవద్దు
శంఖం పూరించాల్సిందే - 
దుకాణదారుల అత్యాశను ఉరితీయాల్సిందే’’!!

ఎండాకాలం రాగానే, ఎటుచూసినా మామిడి పళ్ళు కనబడతాయి. అయితే అందులో విష రసా యనాలు వేసి పండించినవేవో, వేయకుండా పండిన వేవో సామాన్యుడికి అంతుపట్టదు. ‘కార్బైడ్’ వేసి పండిస్తున్నారని చాలామందికి తెలిసిపోయింది. ఇ ప్పుడు చైనా నుంచి మరో విష రసాయనం ‘ఎ- ఇథలిన్’ చిన్నచిన్న ప్యాకెట్లలో వస్తోంది. మనం కప్పులో డిప్ చేసుకుని తాగే టీ బ్లాగ్ సైజులో ఉంటుంది. ఎ-ఇథలిన్ ప్యాకెట్ నీళ్ళలో ముంచి, ఆ తడి ప్యాకెట్‌ను మామిడి కాయల మధ్యలో పెడితే చాలు ఐదారు గంటలకే కాయలన్నీ పళ్ళయి పోతాయి. ‘ఎ.ఇథలిన్’, ‘కార్బైడ్’ లాంటి విషరసా యనాలన్నీ గ్యాస్ విడుదల చేస్తాయి. ఆ గ్యాసు ప్రభావంతో కాయల్లో రసాయనిక చర్య మొదలై కృత్రిమంగా పండుతాయి. ఇవే కాక మొక్కల పెరు గుదలను అదుపులో ఉంచే కొన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి. వీటిని ‘ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్’ అని ‘ఫ్రూట్ హార్మోన్స్’ అని అంటారు. ఉదాహరణకు ‘యం.ఐ గ్రూప్-వన్ 39’ పేరుతో వచ్చే పెస్టిసైడ్ ఉంది. దీన్ని ఒక సీసా మూత నిండా తీసుకుని బకెట్ నీళ్ళలో కలిపి పక్కన ఉంచుకుంటారు. కృత్రిమంగా, త్వరత్వరగా పండించాలనుకున్న కా యలన్నీ అందులో ముంచుతుంటారు. ఉదాహరణ కు అరటిగెలలు ఈ బకెట్ నీళ్ళలో ఓ రెండుసార్లు ముంచి పక్కన పెడితే ఐదారు గంటల్లో ఆకుపచ్చ రంగు పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. 

ఇలాంటి పళ్ళు తినేవారిపై దుష్ప్రభావాలు బా గా ఉంటాయి. మనం పళ్ళు ఎక్కువగా అనారోగ్యం తో ఉన్నవారికి, గర్భిణీలకు, పిల్లలకూ ఇస్తుంటాం. అసలే అనారోగ్యంతో ఉన్న రోగులు, వారి రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోతారు. గర్భిణీలు తింటే ప్రభావం లోపలి పిండంపై ఉంటుంది. అంటే విష ప్రభావం ఈతరం వారి మీద కాకుండా, రాబోయే తరం మీద కూడా పడుతోందన్నమాట! ఇది ఏదో కొద్దిమంది చేసే వ్యాపారం కాదు, ఈ వ్యాపారపు గొలుసును పట్టుకుంటూ పోతే పెద్దపెద్ద అధికా రులూ, పెద్దనేతలే ఉంటారు. ప్రత్యక్షంగా చంపి తేనే హత్యకాదు, పరోక్షంగా చంపినా దాన్ని హత్య కిందే పరిగణించాలి. కఠినమైన చర్యలు తీసుకో వాలి. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేవి అమానుషమైన చర్యలే! మతాధికారులు, ప్రవచనకారులు, బాబా లు, సన్యాసులు ఇప్పటిదాకా తాము చేస్తున్నవి కూడా అమానవీయమైన, అసహ్యకరమైన వ్యాపా రాలే అని వారు తెలుసుకుంటే మంచిది.
image

English Title
అమానవీయ వ్యాపారాలు ఆపాలి!
Related News