ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ

MIM Party, akbaruddin owaisi, legislature of MIM Party 

హైదరాబాద్‌: ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు. ఎంఐఎం పార్టీ రాష్ట్ర కార్యాలయం దారుస్సలాంలో ఆదివారం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ నియమిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. గత అసెంబ్లీలోనూ అక్బరుద్దీన్‌ ఎంఐఎం ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఈసారి కూడా శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్ ఒవైసీ బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు