అర్జున్ కూడా అలాంటోడే...!

Updated By ManamSun, 10/21/2018 - 09:04
actress Sruthi Hariharan accuses actor Arjun
  • సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించారు

  • రిహార్సల్ పేరుతో నా వెన్ను తడిమారు

  • 2016లో ‘విస్మయ’ షూటింగ్‌లో ఘటన

  • ‘మీ టూ’లో నటి శృతి హరిహరన్ ఆరోపణలు

actress Sruthi Hariharan accuses actor Arjun

‘మీ టూ’ వేదికగా కొనసాగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణల పరంపరలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా చేరిపోయారు. ఆయనపై వర్థమాన నటి శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేశారు. అర్జున్‌‌తో కలిసి ‘విస్మయ’ అనే చిత్రంలో నటించినప్పుడు సెట్లో ఆయన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించారు. మీటూ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. ‘మౌనం వీడాల్సిన సమయం ఇది. చిన్నప్పటి నుంచి అనేకసారు్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.

చాలామంది మహిళలకు ఈ అనుభవం ఎదురై ఉంటుంది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు చాలా నేర్చుకోవాలనే ఉత్సాహంతో పరిశ్రమకు వచ్చా. కానీ ఇవాళ నేను పరిశ్రమపై విరక్తితో దీన్ని రాస్తున్నా. ఈ పరిశ్రమ నా కలలు నిజం కావడానికి తోడ్పడింది. నా నైపుణ్యం పెంచింది. స్పూర్తిని కల్గించింది. కానీ చాలా సందర్భాల్లో నేను భయపడ్డాను. బాధపడ్డాను. అని చెప్పడానికి నా హృదయం బద్ధలవుతోంది’ అని శృతి హరిహరన్ తన ఫేస్‌బుక్ వేదికగా పేర్కొన్నారు. 

actress Sruthi Hariharan accuses actor Arjun

‘చిత్ర పరిశ్రమలో సాధారంగా జరిగే వేధింపులు ‘క్యాస్టింగ్ కౌచ్’. సినిమాలో అవకాశం రావాలంటే ఇలా చేయాలంటారు. అదృష్టవశాత్తు నేను అలాంటి వాటి నుంచి తప్పించుకున్నా. కానీ 2016లో జరిగిన ఓ సంఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. దాని నుంచి కోలుకోవడానికి చాలారోజులు పట్టింది. అర్జున్‌తో కలిసి విస్మయ చిత్రంలో నటిస్తున్నా. నేను ఆయన సినిమాల్ని చూస్తూ పెరిగా. అలాంటి ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించా. ప్రారంభంలో కొన్ని రోజులు సాధారంగానే ఉండేవారు.

నేను ఈ సినిమాలో ఆక్ష్న భార్య పాత్రను పోషించా. ఆరోజు రొమాంటిక్ సన్నివేశంలో నటించాల్సి ఉంది. ఒకరినొకరు కౌగిలించుకుని డైలాగ్ చెప్పాలి. అర్జున్ నన్ను కౌగిలించుకున్నారు. తర్వాత ఒక్కసారిగా, చెప్పకుండా చేతులతో నా వీపు తడిమారు. నన్ను ఇంకా దగ్గరికి తీసుకుని ‘ఇలా ప్రయత్నిద్దామా?’ అని దర్శకుడిని అడిగారు. నేను షాక్ అయ్యా. సినిమాలో సహజత్వం ఉండాలి కానీ ఇలా చేయడం తప్పు. ఆయన ప్రవర్తన ఏ మాత్రం నచ్చలేదు. ఆ సమయంలో ఏం అనాలో తెలియక నాపై నాకే కోపం వచ్చింది’ అని ఆమె పేర్కొంది. ‘కెమెరా ముందుకు వెళ్లకముందే సన్నివేశాల్ని రిహార్సిల్ చేస్తారు. సన్నివేశం, హావభావం తదిరత విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

కాబట్టి నటీనటులు మాట్లాడాలి. సన్నివేశానికి తగ్గట్టు మారాలి. నేను ఇప్పటివరకూ కలిసి పనిచేసిన ఏ నటుడూ నన్ను ఇలా ఇబ్బంది పెట్టలేదు. నేను అసౌకర్యంగా ఫీల్ అవడాన్ని దర్శకుడు గమనించారు. రిహార్సిల్‌కు రాను... నేరుగా షూట్‌లో పాల్గొంటాను అని చెప్పా. నా మేకప్ బృందానికి కూడా ఇది తెలిపా. ఆ సంఘటన సెట్‌లో దాదాపు 50మంది ముందు జరిగింది. అప్పుడు నేను ఆయనపై అరవలేదు. ప్రొఫెషనల్‌గా అక్కడ నుంచి దూరంగా వచ్చేశా. దీనివల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలి అనుకోలేదు. సంతకం చేశాను. కాబట్టి పూర్తి చేయాలి.

షూటింగ్ అలాగే కొనసాగించా. ఆయనకు దూరంగా ఉన్నా. అని శృతి పేర్కొన్నారు. ఇలాంటవి నాతోపాటు అందరూ వేర్వేరుగా ఎదుర్కొని ఉంటారు కాబట్టి దీన్ని పబ్లిక్‌గా చెప్పాలి. అందరూ కలిసి మాట్లాడితేనే సమాధానం దొరుకుతుంది. ఇకపై ఏ పురుషుడు.. మహిళను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్యమం ఇది. మహిళలు శక్తివంతంగా మారి, మాట్లాడాల్సిన సరైన సమయం’ అంటూ ఆమె పేర్కొన్నారు. మరోవైపు శృతి ఆరోపణలను అర్జున్ తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన అన్నారు.

English Title
actress Sruthi Hariharan accuses actor Arjun
Related News