మావోల ఘాతుకం.. ఐదుగురు మృతి

Updated By ManamThu, 11/08/2018 - 15:05
Maoists

Maoistsరాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచెలి అటవీప్రాంతంలో బస్సును మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారిలో ఒక సీఆర్పీఎఫ్ జవాను, బస్సు డ్రైవర్, కండక్టర్, క్లీనర్, ఫోలీస్ ఆఫీసర్ ఉన్నారు.

రోజువారి సరుకులు కొని తిరిగి వస్తున్న బస్సుపై మావోలు ఈ దాడి చేశారు. స్థానిక మార్కెట్‌లో నిత్యావసరాలు కొనుక్కుని ఓ ప్రైవేటు బస్సులో వస్తుండగా మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారని దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ తెలిపారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా  ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు శుక్రవారం చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు రానుండగా.. ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. కాగా గత పది రోజుల్లో చత్తీస్‌గఢ్‌లో మావోలు దాడి చేయడం ఇది రెండోసారి. గత నెల అక్టోబర్ 30న దంతెవాడ జిల్లాలోని అంబుస్‌లో మావోలు జరిపిన దాడిలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, ఒక దూరదర్శన్ కెమెరామన్ మరణించిన విషయం తెలిసిందే. 

English Title
5 Killed As Maoists Blow Up Bus In Chhattisgarh
Related News