అంతరిక్షంలో 35 రోజులు

Updated By ManamWed, 06/13/2018 - 23:35
image

image‘ఘాజీ’ వంటి డిఫరెంట్ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో అంతరిక్షం నేపథ్యంలో మరో కొత్త తరహా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తొలి అంతరిక్ష నేపథ్య సినిమాగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ వ్యోమగామిగా కనిపిస్తారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 35 రోజులపాటు శూన్యంలో ఈ షెడ్యూల్‌ను చేశారు. ఎంతో క్రియేటివిటీతో ఈ చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూనిట్ సభ్యులంతా కలిసి దిగిన ఒక ఫోటోను విడుదల చేశారు.

‘ఇప్పటి వరకు తెరపై చూడని దానిని సాధించాం. దీని కోసం మా యూనిట్ ఎంతో కృషి చేసింది’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ‘ఘాజీ’తో సముద్ర గర్భంలో జరిగిన యుద్ధాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలో అంతరిక్షాన్ని నేపథ్యంగా ఎంచుకోవడం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. 

English Title
35 days in space
Related News