అమెరికాతో సుంకాల యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో అమెరికా నుంచి వచ్చే 29 ఉత్పత్తులపై 241 మిలియన్ల డాలర్ల మేరకు విధించిన ప్రతీకార దిగుమతి సుంకాల అమలును మరో నెలన్నర వాయిదా వేయాలని ఇండియా భావిస్తోంది.
భారతదేశపు మౌలిక వసతుల్లో లోటు ‘‘చాలా పెద్ద’’ దని, సరఫరాకి, డిమాండ్‌కి మధ్య గణనీయైమెన లోటును భర్తీ చేయడానికి దేశం ఇంకా చాలా దూరమే పయనించవలసి ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ సోమవారం వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2018-19 మొదటి త్రైమాసికంలో రూ. 1,119 కోట్ల నికర నష్టాన్ని చవిసూసింది.
భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజి బోర్డు (సెబి) పూర్తి కాల సభ్యునిగా అనంత బారువా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
సిబ్బంది జీత భత్యాలకు కోత పెట్టుకోవడంతో సహా ఖర్చులను తగ్గించుకునే చర్యలు చేపడితే తప్పించి జెట్ ఎయిర్ వేస్ (ఇండియా) లిమిటెడ్  60 రోజులకు మించి కార్యకలాపాలు నిర్వహించలేకపోవచ్చునని తెలిసింది.
ఆదాయ పన్నుపై వివాదం తలెత్తితే ప్రొసీడింగుల నుంచి స్టే తెచ్చుకునేందుకు ఇప్పుడు మునుపటి కన్నా తక్కువ ఖర్చు కానుంది.
రెండు రోజుల వరుస నష్టాల తర్వాత మార్కెట్‌లు పుంజుకుని శుక్రవారం లాభాలను నమోదు చేశాయి.
చైనా నిబంధ‌న‌ల‌ను త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చిన గూగుల్ తిరిగి అక్క‌డ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు ప్రారంభించింది.
జైపూర్‌లో సుప్రసిద్ధ జై మహల్ హోటల్ ప్రాపర్టీపై నియంత్రణ అధికారం దివంగత మహారాణి గాయత్రీ దేవి మనువులు, మనవరాళ్ళదేనని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. ఒకప్పటి ఆ రాజ భవనాన్ని నియంత్రిస్తున్న కంపెనీలో మెజారిటీ వాటాను వారికి పునరుద్ధరించింది.


Related News