న్యూజెర్సీలో జీవీఎల్‌కు షాకిచ్చిన ప్రవాసాంధ్రులు

Updated By ManamThu, 05/17/2018 - 11:22
NRIS Gives sudden shock to bjp mp gvl narasimha rao In new jersey

NRIS Gives sudden shock to bjp mp gvl narasimha rao In new jersey

న్యూజెర్సీ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు న్యూజెర్సీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం, ఏపీలోని రాజకీయ పరిణామాలపై ప్రసంగించారు. ఏపీకిచ్చిన హామీల అమలు మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జీవీఎల్ ప్రసంగానికి పలువురు ప్రవాసాంధ్రులు అడ్డు తగిలారు. మీరు చెబుతున్నవన్నీ అబద్దాలు అంటూ ప్రవాసాంధ్రులు తప్పుబట్టారు.

ఏపీని కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తోంది?.. హామీలు అమలు చేయకుండా ఎందుకు ఏపీ పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది? అని జీవీఎల్‌కు సూటి ప్రశ్నలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందేనని సమావేశ ప్రాంగణం బయట నినాదాలు చేశారు. దీంతో జీవీఎల్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. ప్రసంగం మధ్యలోనే ఆపేసి కమిటీ హాల్‌నుంచి ఎంపీ బయటికి వెళ్లిపోయారని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
NRIS Gives sudden shock to bjp mp gvl narasimha rao In new jersey
Related News