Home » పుష్ప సినిమాలో కేశవ పాత్ర ని మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్.. అతి పెద్ద బ్యాడ్ లక్ అంటే ఇదే కదా..?

పుష్ప సినిమాలో కేశవ పాత్ర ని మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్.. అతి పెద్ద బ్యాడ్ లక్ అంటే ఇదే కదా..?

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా మంచి హిట్ అయింది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ పుష్ప సినిమా తర్వాత నార్త్ ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే. బన్నీ పాత్రలానే ఈ సినిమాలో బన్నీ పక్కన నటించిన కేశవ పాత్ర కూడా హైలెట్ అయింది. పుష్ప రాజ్ కి ప్రాణ స్నేహితుడుగా కేశవ నటించాడు. అయితే నిజానికి మొదట బన్నీకి స్నేహితుడిగా ఒక హీరోని అనుకున్నారు.

Advertisement

Also read:

కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇలా కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది కానీ ఈ రోల్ కోసం ముందు టాలీవుడ్ హీరో సుహాస్ ని అనుకున్నారు. ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా సుకుమార్ వచ్చారు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో పాయల్ రాజ్పుత్, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన ప్రసన్న వదనం సినిమాకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. మే 3న ఈ సినిమా విడుదలవుతుంది. హైదరాబాదులో ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపారు.

Advertisement

suhas remunaration

suhas

Also read:

సుకుమార్ బుచ్చిబాబుతో పాటుగా సుకుమార్ సతీమణి కూడా వచ్చారు. సుకుమార్ మాట్లాడుతూ జగడం మూవీ చేస్తున్న టైంలో డైరెక్టర్ అర్జున్ కలిశాడని ఆర్య మూవీ నచ్చి నా వద్ద పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పాడని ఇలా నా టీంలో జాయిన్ అయ్యాడని చెప్పారు సుకుమార్. సుహాస్ నువ్వు అంటే నాకు అల్లు అర్జున్కి చాలా ఇష్టం. నీ ఎదుగుదలని చూస్తున్నాము. పుష్ప మూవీ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ ని ముందు నీకే అనుకున్నాము కానీ అప్పటికే హీరోగా చేస్తూనే నిన్ను ఆ పాత్ర కోసం ఎంపిక చేయడం బాగోదని అనిపించింది సుహాస్ ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడు అని సుకుమార్ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading