Home » బాల‌య్య చేయాల్సిన సింహాద్రి NTRకు ఎలా వచ్చింది?

బాల‌య్య చేయాల్సిన సింహాద్రి NTRకు ఎలా వచ్చింది?

by Azhar
Ad

సింహాద్రి NTRను స్టార్ హీరోగా నిల‌బెట్టిన సినిమా.! స్టూడెంట్ నెంబ‌ర్ 1 త‌ర్వాత అల్ల‌రి అల్లుడు, నాగా లాంటి రెండు ప్లాప్ ల త‌ర్వాత ఒక మంచి హిట్ కొట్టాల‌న్న క‌సితో NTR క‌థ‌లు వింటున్నారు. ఏవీ ఆయ‌న‌కు న‌చ్చ‌ట్లేదు.

ఇదిలా ఉండ‌గా… బి గోపాల్ డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ హీరోగా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఒక మంచి మాస్ క‌థ‌ను రెడీ చేసుకున్నారు. కానీ గోపాల్ వేరే క‌థ‌ను సెలెక్ట్ చేసుకోవ‌డంతో ఈ క‌థ అలాగే ఉండిపోయింది. రాజ‌మౌళి ఆ క‌థ‌ను NTR కు వినిపించ‌మ‌న్నాడు, కానీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ 20 ఏళ్ల NTR ఈ క‌థ‌ను డీల్ చేయ‌లేడేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేయ‌డంతో …. అప్ప‌టికే స్టూడెంట్ నెంబ‌ర్ 1 ను NTR తో తీసిన అనుభ‌వంతో రాజ‌మౌళి NTRపై త‌న‌కు న‌మ్మ‌కముంద‌న్నాడు.

Advertisement

Advertisement

క‌థ NTR విన్నాడు, ఒకే చేశాడు …ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. మొద‌ట ఆర్తి అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్న‌ప్ప‌టికీ ఆమె వ‌సంతం సినిమాతో బిజీగా ఉండ‌డంతో అంకిత‌ను తీసుకున్నారు. డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి…మ్యూజిక్ కీర‌వాణి. 8 కోట్ల బ‌డ్జెట్ తో మొద‌లైన‌ సినిమా. 2003 జులై 9 న 150 ప్రింట్లతో విడుద‌లైంది.


విడుద‌ల‌కు ముందే 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. NTR యాక్టింగ్, ఇంట‌ర్వెల్ బ్యాంగ్, యాక్ష‌న్ సీన్లు, క్లైమాక్స్ , డాన్సులు, పాట‌లతో సినిమా ఇండ‌స్ట్రీ హిట్ ను కొట్టింది.

కలెక్ష‌న్లు – రికార్డులు :

  • 8 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా 25 కోట్ల‌ను క‌లెక్ట్ చేసింది.
  • 180 సెంట‌ర్ల‌లో 50 రోజులు ఆడిన సినిమాగా రికార్డ్
  • 150 సెంట‌ర్ల‌లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన సినిమా.
  • 55 సెంట‌ర్ ల‌లో 175 ఆడి ఇండియా రికార్డ్

Also Read: కోలీవుడ్ లో పెరుగుతున్న విడాకులు.. జెమిని గణేశన్‌ నుంచి ధనుష్‌ వరకు

Visitors Are Also Reading