నేను టెర్రరిస్ట్‌ను కాదు

Updated By ManamWed, 05/30/2018 - 14:13
Sanju

sanju బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎమోషనల్‌గా ట్రైలర్‌ను తీర్చిదిద్దిన దర్శకుడు, అందులోనే సంజయ్ దత్‌కు సంబంధించిన విషయాలను చూపించాడు. మొత్తానికి ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో మనీషా కొయిరాలా, పరేశ్ రావల్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.


 

English Title
Sanju trailer talk
Related News