Home » హరిహర వీరమల్లు నుండి క్రిష్‌ ఎందుకు తప్పుకున్నారు..?.. కొత్త డైరెక్టర్‌ ఎవరంటే…?

హరిహర వీరమల్లు నుండి క్రిష్‌ ఎందుకు తప్పుకున్నారు..?.. కొత్త డైరెక్టర్‌ ఎవరంటే…?

by Sravya
Ad

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల దగ్గర పడుతుండడంతో ఫోకస్ అంతా కూడా పాలిటిక్స్ మీద పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు తో పాటుగా పలు సినిమాలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ నుండి క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారట. క్రిష్ ఇందులో నుండి తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంది. 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మొగల్ చక్రవర్తి గోల్కొండ నవాబుల దోపిడీ మీద తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Advertisement

ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాబి డియోల్ ఢిల్లీ మొగల్ చక్రవర్తి పాత్రలో నటించబోతున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతోంది. మొదటి పార్టీ ఈ ఏడాది థియేటర్లో కి రాబోతోంది. మే రెండు నా హరిహర వీరమల్లు టీజర్ వచ్చింది ఇందులో పవన్ పాత్ర విరోచిత పోరాటాన్ని చూపించారు. పేదల కోసం దోపిడీ కి గురవుతున్న ప్రజలకి అండగా నిలిచిన వీరమల్లు పాత్రలో పవన్ అదరగొట్టేశారు. విజువల్స్ యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. పవన్ కి డైలాగులు లేకపోవడం కాస్త నిరాశపరిచింది. అయితే ఈ సినిమా నుండి క్రిష్ జాగర్లమూడి పేరుని తొలగించడం ఆశ్చర్యంగా మారింది.

Advertisement

Also read:

Also read:

అసలు దర్శకుడు ఎవరనేది కూడా పోస్టర్లో కానీ టీజర్ లో కానీ మెన్షన్ చేయలేదు. దీంతో అందరికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడుగా కొత్త పేరుని వెల్లడించింది. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ పార్ట్ కి అతని డైరెక్టర్ చేస్తారని క్రిష్ పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు. మరి క్రిష్ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్ లో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేశారని అందుకు అతను నో చెప్పాడని తన మాట వినకపోవడం వలన పవన్ సినిమా విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడని ప్రచారం కూడా జరిగింది అసలు ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఇప్పటికి కూడా సినిమా ఎక్కడో ఆగిపోయింది ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే మూవీ ని రూపొందిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading