Home » Krishnamma Review: కృష్ణమ్మ సినిమా హిట్టా, ఫట్టా..?

Krishnamma Review: కృష్ణమ్మ సినిమా హిట్టా, ఫట్టా..?

by Sravya
Ad

తెలుగు ఇండస్ట్రీలో వివిధ కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండే వాళ్ళలో సత్యదేవ్ ముందు గుర్తొస్తారు. పదేళ్ల కెరియర్ లో ఆయన ఇప్పటిదాకా చాలా రకాల పాత్రలు పోషించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. విలన్ పాత్రలు కూడా చేసి విశ్వరూపాన్ని చూపించారు. సత్య దేవ్ ఇప్పుడు కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకులు ముందుకి థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.

సినిమా: కృష్ణమ్మ
దర్శకత్వం: వివి గోపాలకృష్ణ
నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
నటులు: సత్యదేవ్. అతిరా రాజ్, రఘు కుంచే, లక్ష్మణ్
ఎడిటింగ్: తమ్మి రాజు

Advertisement

కథ మరియు వివరణ:

250 మంది కుటుంబాలు ఉన్న ఇచ్చిపేట అనే గ్రామంలోని వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి కొంతమందిని కేసుల్లో ఇరికిస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భద్ర తన ఫ్రెండ్స్ కూడా ఒక కేసులో ఇరుక్కుంటారు వీళ్ళకి ముందు వెనక ఎవరూ ఉండరు. కనుక వీళ్ళని ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ఉద్దేశంతో కేసులో ఇరికించి జైలుకు పంపిస్తారు. అక్కడి నుండి అణచివేతకు గురవుతున్న వీళ్ళు తిరుగుబాటు చేస్తారు వీళ్ళ మీద అధికారాన్ని చెలాయించి వారిని హతం చేశారా..? లేదంటే వీళ్ళే అంతమయ్యారా అనేది తెలియాలంటే సినిమా తప్పక చూడాలి.

Advertisement

దర్శకుడు వివి గోపాలకృష్ణ రాసుకున్న కథలో కాన్ఫ్లిక్ట్ చాలా బాగుంది. హీరో భద్ర క్యారెక్టర్ చాలా బాగా రాశారు సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని సీన్లు అయితే సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో సినిమా స్టార్ట్ అయిన వెంటనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కోసం కొంచెం టైం తీసుకోవడం ప్రేక్షకులకి కాస్త బోర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్టాండర్డ్ ని బట్టి రిచ్ గా ఉన్నాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్ కూడా బాగుంది. సత్యదేవ్ నట విశ్వరూపం చూపించారు.

Also read:

భయం రౌద్రం వంటి నవరసాలను పోషించారు. అతిరా రాజ్, అర్చన కూడా పాత్రకి తగ్గట్టుగా బానే నటించారు. రఘు కుంచే, లక్ష్మణ్ పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి సాంగ్స్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించారు. కృష్ణమ్మ అందాలను అద్భుతంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ తమ్మి రాజు చాలా అద్భుతంగా పని చేశారు.

Also read:

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్ నటన
కథ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్లు

అక్కడక్కడ సీన్స్
డైరెక్షన్ అంత పర్ఫెక్ట్ గా లేకపోవడం
మొదటి హాఫ్ స్లో అవ్వడం

రేటింగ్: 2.5/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading