Home » మిమ్మల్ని మీరు ఆకర్షణంగా మార్చుకోవాలంటే ఇలా చేయండి..!

మిమ్మల్ని మీరు ఆకర్షణంగా మార్చుకోవాలంటే ఇలా చేయండి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణంగా కనపడాలని అనుకుంటారు మీరు కూడా మిమ్మల్ని మీరు ఆకర్షణంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి శారీరకంగా ఆకర్షణంగా ఉన్నామా లేమా అనేది మనసుల వరకు వెళ్లదు. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే తీరు వ్యవహరించే తీరు మీద ఆకర్షణ పెంచే విధంగా చేస్తుంది. మిర్రర్ బాడీ లాంగ్వేజ్ కారణంగా ఎదుట వ్యక్తి కచ్చితంగా మీకు ఎట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మీ భాష మీ నడవడిక మీ ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అలానే జెంటిల్ టచ్ నిత్యం అద్భుతాలను చేస్తుంది.

Advertisement

ఏ మాట చెప్పినా ఎదుటి వాళ్ళకి ధైర్యం రాదు ఒక టచ్ కారణంగా ధైర్యం వస్తుంది. ఒకరికొకరు దగ్గర అవుతారు. కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మీరు ఇతరుల పేరుని చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి అది నచ్చుతుంది. ఎదుటి వ్యక్తిని అందరి ముందు సింపుల్ గా పిలవాలి. అలానే మీ వ్యక్తిగత అనుభవాలను అభిప్రాయాలను ఎదుటి వ్యక్తులతో పంచుకోండి ఇలా ఎదుటి వాళ్ళు మీపై ఆకర్షితులవుతారు.

Advertisement

Also read:

Also read:

మీ మనసుకు కూడా బాగా దగ్గర అవుతారు. అలానే ఎదుటి వాళ్ళు చెప్పే సమస్యలను బాధల్ని కూడా శ్రద్ధగా వినాలి. మీకు తోచిన సలహా ఇవ్వాలి. కష్టాలని వినే వాళ్ళపై ఎప్పటికీ అభిమానం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలానే పాజిటివ్ గా ఉండాలి ఎదుటి వాళ్ళు చెప్పే అన్ని విషయాలపై మీరు కాస్త పాజిటివ్ గా ఉంటూ ఉండాలి. నడక ఎప్పుడు మన భావాలని ఆలోచనని దాదాపు ప్రతిబింబిస్తుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. ఇలా మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading