Home » పవన్‌, చరణ్‌ సినిమాల్లో చిరు ఫేవరెట్‌ మూవీ ఏదో తెలుసా..?

పవన్‌, చరణ్‌ సినిమాల్లో చిరు ఫేవరెట్‌ మూవీ ఏదో తెలుసా..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీలోని చాలామందిని హీరోలుగా మార్చేశారు. మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ను మే 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. అవార్డును అందుకున్నాక చిరంజీవితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

Advertisement

Also read:

ఇరువురు సినిమాలు రాజకీయాలు ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిట్ చాట్ టైం లో చిరంజీవి మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, తమ్ముడు, జల్సా సినిమాలు చాలా ఇష్టం అని చెప్పారు. జల్సా సినిమాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే మగధీర సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు.

Advertisement

chiranjeevi and ram charan

chiranjeevi and ram charan

పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మంచి విజయాలు సొంతం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో తనకు కూడా సన్నిహిత్యం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో చిరంజీవిని కొత్తగా చూస్తామని చిత్ర యూనిట్ అంటోంది. చాలా ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న సోషల్ ఫాంటసీ అవడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading