Home » జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబుకే ఎక్కువ ఆస్తులు.. ఏకంగా ఇన్ని కోట్లు బాబుకే ఎక్కువా..?

జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబుకే ఎక్కువ ఆస్తులు.. ఏకంగా ఇన్ని కోట్లు బాబుకే ఎక్కువా..?

by Sravya
Ad

రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న టైం లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ వేల కోట్లు కూడబెట్టారు. లక్ష కోట్ల దాకా సంపాదించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు టీడీపీ చేసిన ఆరోపణలు ఇవి. అయితే వైఎస్ఆర్సిపి కూడా ధీటుగా సమాధానం చెప్పింది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకి ఉన్న ఆస్తి రెండు ఎకరాల పొలం. అలాంటి వ్యక్తి వేల కోట్లు ఆస్తుల్ని ఎలా సంపాదించారని వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పటికీ టైం వస్తే ఒకరి ఆస్తులు గురించి ఒకళ్ళు విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు.

ys-jagan

Advertisement

Advertisement

 

అయితే తాజాగా ఇద్దరు ఆస్తులు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్ సమర్పించిన ఎన్నికల సంఘానికి అఫీడవిట్లు పరిశీలించినట్లయితే జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబానికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. జగన్ కుటుంబం అంటే ఆయన సతీమణి, ఇద్దరు కూతుర్లు, జగన్ కానీ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కలిపి ఒకే ఫ్యామిలీ గా చూస్తే బాబు కుటుంబానిదే పై చేయి.

ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్లు. లోకేష్ బ్రాహ్మణి దేవాన్ష్ ముగ్గురు పేరిట ఉన్న ఆస్తులు విలువ ఇది. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు పేరిట 931 కోట్లు ఉండగా ఐదుగురాస్తుల విలువ కలిపితే రూ. 1473 కోట్లు. ఇక జగన్ ఆస్తులు విలువ వచ్చేసి 7,79.8 కోట్లు. జగన్ పేరు మీద 529.87 కోట్లు ఉండగా, జగన్ భార్య పేరు మీద 176.30 కోట్లు ఉన్నాయి. జగన్ ఫ్యామిలీ కంటే నారా కుటుంబ ఆస్తులు విలువ 693 కోట్ల కంటే ఎక్కువ ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading