ఈ హీరోయిన్ ఎవరో గుర్తుందా?

Updated By ManamWed, 06/13/2018 - 14:53
mahima

mahima మహిమా చౌదరి ‘పర్‌దేశ్’ చిత్రం ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసి తన నటనతో ఫిల్మ్ ఫేర్ అందుకున్న ఆమె గత కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు. బాబీ ముఖర్జీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె సుదీర్ఘకాలం తర్వాత ఆర్టిస్ట్  ప్రభాకర్ సింగ్ ఏర్పాటు చేసిన ఓ ఆర్ట్ షోలో తళుక్కుమన్నారు. 1997లో వచ్చిన ‘పర్‌దేశ్’ సినిమాలో అమాయక యువతిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన మహిమా చౌదరి బాలీవుడ్ లో టాప్ హీరోల సరసన జతకట్టారు. తెలుగులో జగపతి బాబు, శ్రీకాంత్ నటించిన  'మనుసులో మాట' చిత్రంలో ఆమె నటించారు. 

అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మాధూరి దీక్షిత్ తో తర్వాత అంత అందమైన చిరునవ్వు మహిమాదే అని ప్రశంసలు అందుకున్నారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ అర్చనాశర్మ జీవితం ఆధారంగా ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ చిత్రంతో  రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకూ మహిమా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చాలాకాలం తర్వాత మహిమా కెమెరా కంటికి చిక్కడంతో ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. మరి అభిమానుల కోసం ఆమె మరోసారి వెండితెరపైకి కనిపిస్తారేమో చూడాలి. ఈ ఆర్ట్ షోలో పూజా బేడీ, చెఫ్ సంజీవ్ కపూర్, రేఖా రానా తదితరులు పాల్గొన్నారు.

English Title
Mahima Chaudhary In Prabhakar Singh art show
Related News