'ఇష్టానుసారం ఆరోపిస్తే సహించేది లేదు'

Updated By ManamThu, 07/12/2018 - 20:04
Not allegates, tolerated, RTC chairman, somarapu satyanarayana

Not allegates, tolerated, RTC chairman, somarapu satyanarayanaహైదరాబాద్: తనపై ఇష్టానుసారం ఎవరైనా ఆరోపణలు చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ బాటలోనే పయనిస్తానని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానన్నారు. రానున్న రోజుల్లో రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని స్పష్టంచేశారు. పనిచేయని ప్రజాప్రతినిధులపై అవిశ్వాసం పెట్టే హక్కు ఉందన్నారు.

సొంత పార్టీ కార్పొరేటర్లే తన మాట వినలేదనే బాధతో ఇటీవల రాజకీయాల నుంచి వైదొలగాలని సోమారపు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని ప్రకటించిన మరుసటి రోజే మంత్రి కేటీఆర్‌తో సోమారపు చర్చలు జరిపారు. చర్చల అనంతరం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని, రాజకీయాల్లోనే కొనసాగుతానని సోమారపు ప్రకటించారు. 

English Title
Do not allegate me as u like, not tolerated, says RTC chairman somarapu satyanarayana
Related News