బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబల్ హాసన్ గురించి తెలియని వారుండరు. టి20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు సారథ్యం వహించే షకీబల్ హాసన్, ఈ రెండు ఫార్మాట్లలో కూడా ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ అన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో కూడా రాణిస్తున్నాడు. ఈ ఫార్మాట్లో ప్రపంచ బెస్ట్ ఆల్ రౌండర్లలో మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇలా కేవలం ఆటతోనే కాదు.
Advertisement
read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?
చిన్న చిన్న గొడవల కారణంగా షకీబల్ హాసన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఇప్పుడు షకీబల్ హాసన్ చేసిన పని మరింత గొడవకు దారితీసింది. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా మాట్లాడుతూ షకీబల్ హసన్ మరో సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ మధ్య గొడవలు ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. చాట్టోగ్రామ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబల్ హాసన్ వచ్చాడు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం అతన్ని పిలిచినట్లు తెలుస్తోంది.
Advertisement
READ ALSO : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
దీనికోసం వచ్చిన అతన్ని చూసేందుకు బంగ్లా అభిమానులు ఎగబడ్డారు. ఇలా తనను చుట్టుముట్టిన వారిలో ఒక వ్యక్తి పై షకీబల్ హాసన్ దాడి చేశాడు. చేతిలోని క్యాప్ తో ఆ అభిమానిని చాలాసార్లు కొట్టాడు. ఇది చూసిన సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని ఈ స్టార్ క్రికెటర్ ను పక్కకు తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మరోసారి షకీబల్ హాసన్ ప్రవర్తనపై కాంట్రవర్సీ చెలరేగింది.
Nah i love shakib al hasan sometimes you just gotta beat ‘em up pic.twitter.com/JDzA5q58TR
— adi ✨🇧🇩 (@notanotheradi) March 10, 2023
Advertisement
read also : “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!