Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచు మనోజ్

12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచు మనోజ్

by Bunty
Published: Last Updated on
Ads

ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి మూడవ తేదీ శుక్రవారం రాత్రి 8:30 శుభముహూర్తాన భూమా మౌనిక మెడలో మంచు మనోజ్ మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వారి గురించి తెలియని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ కొత్త జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

read also : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

Ad

 

ఇది ఇలా ఉండగా, మనోజ్, మౌనిక దంపతులు సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదు అన్నారు. ఎప్పటికీ ప్రేమే గెలవాలన్నారు. తమ ప్రేమ గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తన షూటింగ్ మొదలైంది అన్నారు. ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి తిరిగి మొదలు పెడుతున్నట్టు తెలిపారు.

Advertisement

READ ALSO : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

రాజకీయాల్లో రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందని, అదే తమను కలిపిందన్నారు. మౌనిక రెడ్డి తనకు 12 ఏళ్లుగా తెలుసన్నారు. ఆరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ ఇబ్బందుల నుంచి మౌనిక బయటకు తీసుకువచ్చిందని తెలిపారు. శివుడి ఆజ్ఞతో పెద్దలందరూ కలిసి తమ పెళ్ళి చేశారన్నారు. ‘కలిసొచ్చో కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. మనోజ్ తో పాటు మంచు లక్ష్మీ ప్రసన్న కుటుంబం, తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

read also : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading