Home » బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

by Bunty
Ad

టీమిండియా స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, ఈ టీమిండియా స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే బీసీసీఐ వెన్ను నొప్పికి సంబంధించిన శస్త్రచికిత్స కోసం బుమ్రాను న్యూజిలాండ్ కు పంపించింది. జోప్రా ఆర్చర్, షెన్ బాండ్లకు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్, బుమ్రాకు చికిత్స అందించాడు.

 

Advertisement

ఈ నేపథ్యంలోనే బుమ్రాకు సర్జరీ విజయవంతం అయినప్పుడు సమాచారం అందింది. సర్జరీ సక్సెస్ అయినప్పటికీ బూమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసి ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఇక గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు.

Advertisement

వెన్నునొప్పి కారణంగా సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్, తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నిలకు కూడా బుమ్రా దూరం అయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నికి కూడా అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా దూరం అవడం ముంబై ఇండియన్స్ కు ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. సర్జరీ పూర్తయిన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ వరకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Visitors Are Also Reading