Home » ఐపీఎల్ లో అదరగొడుతొన్న హైదరాబాదీ క్రికెటర్.. త్వరలోనే టీమిండియాలోకి !

ఐపీఎల్ లో అదరగొడుతొన్న హైదరాబాదీ క్రికెటర్.. త్వరలోనే టీమిండియాలోకి !

by Anji
Ad

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్ వరుస పరాజయాలను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ తతో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజయం సాధించింది. ముంబై తరపున ఒక్క ఆటగాడు మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. సూపర్ స్ట్రై్ రేట్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అతను ఎవ్వరో కాదు.. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ నిన్న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు తిలక్.  

Also Read :   చెన్నై టీమ్ నిషేదించాలని అసెంబ్లీలో డిమాండ్.. ఎందుకోసం అంటే ?

Advertisement

అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఈ సీజన్ లో ముంబైకు తొలి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 29 బంతులు ఎదుర్కొన్న ఈ యంగ్ బ్యాటర్ 41 పరుగులు చేసాడు. ఒక ఫోర్, 4 సిక్స్ లు ఉండటం గమనార్హం. ముఖ్యంగా ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు తిలక్. అంతకు ముందు బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్ లో తిలక్ ఆడిన ఇన్నింగ్స్ ను అంత ఈజీగా మరిచిపోలేం. ఆ మ్యాచ్ లో కేవలం 46 బంతులు ఎదుర్కున్న వర్మ 9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.   ఈ సీజన్ లో మొత్తానికి మూడు మ్యాచ్ లు ఆడిన హైదరాబాదీ క్రికెటర్ 147 పరుగులు చేసి టోర్నోలోనే ముంబై తరుపున టాప్ స్కోరర్ గా తిలక్ వర్మనే కొనసాగుతున్నాడు.  

Advertisement

Also Read :  RCB కి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్!

ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు క్రికెటర్లు తిలక్ బ్యాటింగ్ కి ముగ్దులవుతున్నారు. ఎలాంటి పిచ్ పై అయినా చెలరేగే సత్తా తిలక్ కి ఉంది. అతను ముంబైకు దొరికిన విలువైన ఆస్తి అని ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే తిలక్ ను అభినందించారు. త్వరలోనే తిలక్ ని భారత జట్టులో చూడాలనుకుంటున్నాం. మిడిల్ ఆర్డర్ లో రాణించే సత్తా వర్మకు ఉంది అంటూ క్రికెట్ అభిమానులు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. 

Also Read :  మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Visitors Are Also Reading