Home » ఈ పేరు గల అమ్మాయిలు చాలా లక్కీ.. వారు ఏం కోరుకుంటే అది నేర‌వేరుతుంది

ఈ పేరు గల అమ్మాయిలు చాలా లక్కీ.. వారు ఏం కోరుకుంటే అది నేర‌వేరుతుంది

by Anji
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. నామ‌శాస్త్రంలో వ్య‌క్తుల పేర్ల ఆధారంగా వారి వ్య‌క్తిత్వం భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఓ వ్య‌క్తి పేరు అతని జీవితంపై చాలా ప్ర‌భావం చూపిస్తుంది. కొన్ని అక్ష‌రాల‌ను చాలా ప‌విత్ర‌మైన‌విగా ప‌రిగ‌ణిస్తారు. స్త్రీలు అదృష్ట‌వంతులుగా భావించే కొన్ని పేర్లున్నాయి.

Advertisement

ఆ పేర్లున్న వారు జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదుగుతారు. ముఖ్యంగా K, M, P అక్ష‌రాల‌తో పేర్లు క‌లిగిన అమ్మాయిల‌ను అదృష్ట‌వంతులుగా పిలుస్తారు. ఇక వారికి అదృష్టం క‌లిసి వ‌స్తుంది. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి, ల‌క్ష్యాన్ని సాధిస్తారు. వీరికి స‌మాజంలో గుర్తింపు ల‌భిస్తుంది.


K అక్ష‌రంతో పేరు ప్రారంభ‌మ‌య్యే అమ్మాయిలు ఎప్పుడు త‌మ లక్ష్యం కోసం ప‌ని చేస్తుంటారు. త‌మ‌కు అంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆమె తెలివి తేట‌ల‌తో సంప‌ద‌తో పాటు కీర్తిని పొందుతారు. త‌ల‌పెట్టిన ఏ ప‌ని అయినా విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌ల‌మ‌ని బ‌లంగా న‌మ్ముతారు. ప‌ని ప‌ట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న విశేష గౌర‌వం ల‌భిస్తుంది.

Advertisement

M అక్ష‌రంతో పేరు మొద‌ల‌య్యే అమ్మాయిలు చాలా అదృష్ట‌వంతులు డ‌బ్బు విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఆర్థికంగా బ‌ల‌వంతులు న‌లుగురితో పోల్చితే వ్య‌క్తిత్వం కూడా చాలా భిన్న‌మైంది. వారి కృషి వ‌ల్ల జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు. వీరి వాగ్దాది అంద‌రినీ ఆక‌ట్టుకుంది. వారు ఎంచుకున్న రంగంలో వారి కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. త‌ప్ప‌కుండా విజ‌యం సాదిస్తారు.


P అక్ష‌రంతో పేరు ప్రారంభ‌మ‌య్యే అమ్మాయిలు జీవితంలో ఏదో సాధించాల‌న్న త‌ప‌న‌ను క‌లిగి ఉంటారు. ముంద‌డుగు వేయ‌డ‌మే త‌ప్ప వెనుక‌డుగు వేయ‌రు. చాలా తెలివిగా మాట్లాడుతారు. త‌మ ప‌నిని ఎలా పూర్తి చేయాలో వీరికి తెలుసు. స‌మాజంలో విభిన్న‌మైన గుర్తింపు తెచ్చుకోవాల‌ని భావిస్తారు. ఇందుకోసం వారు చాలా క‌ష్ట‌ప‌డ‌తారు. ఇలాంటి అమ్మాయిలు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌త్యేకంగా ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తారు.

అయితే K, M, P అక్ష‌రాల‌తో పేర్లున్న వారంద‌రూ ఇలాగే ఉంటార‌ని అనుకోవ‌ద్దు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు పుట్టిన జ‌న్మ నక్షత్రాల ఆధారంగానే త‌మ పేర్లను పెడుతారు. ఆ అక్ష‌రాలతోనే వారికి నామ‌క‌ర‌ణం చేస్తారు. అలాంటి వారికి మాత్ర‌మే ఇది వ‌రిస్తుంది. కొందరూ త‌ల్లిదండ్రులు ఇవేమి లేకుండా త‌మ‌కు న‌చ్చిన పేరున పెడ‌తారు. అలాంటి వారికి ఇది వ‌ర్తించద‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read : 

ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ తాగితే వచ్చే ప్రమాదం ఏంటో మీకు తెలుసా..?

ఒకప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసారా..?

 

Visitors Are Also Reading