Home » బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

by AJAY
Ad

డ‌బ్బు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అధికంగా ఖ‌ర్చులు చేస్తే ఆ త‌ర‌వాత డ‌బ్బులు లేక ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌దు. అలా అని మొత్తానికే డబ్బు ఖ‌ర్చు చేయ‌క‌పోయినా సంపాదించిందంతా ప‌రాయివాళ్ల పాలు అవ్వ‌డం కూడా త‌ప్ప‌దు. కాబ‌ట్టి ఎక్క‌డ అవ‌స‌రం ఉందో అక్క‌డ ఖ‌ర్చు చేస్తూనే డ‌బ్బును పొదుపు కూడా చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రానికి సీఎం అయినా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించిన ఎన్టీరామారావు కూడా డ‌బ్బు విష‌యంలో చాలా క‌రెక్ట్ గా ఉండేవార‌ట‌.

ఇవి కూడా చదవండి:  న‌టి స్నేహ చేసిన వ‌ర‌ల‌క్ష్మీ పూజకు హాజ‌రైన సీనియ‌ర్ హీరోయిన్స్‌.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్..!

Advertisement

పాలు అమ్మి ఎంతో క‌ష్ట‌ప‌డి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన ఎన్టీఆర్ ఎలాంటి గ‌ర్వం లేకుండా ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డుచుకునేవారు. డ‌బ్బు విష‌యంలోనూ ఎన్టీఆర్ చాలా స్క్రిక్ట్ గా ఉండేవార‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత న‌టుడు ముర‌ళీమోహ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ త‌న తోటి న‌టీన‌టుల‌తో పోల్చుకోకుండా త‌క్కువ రెమ్యున‌రేషన్ తీసుకునేవార‌ని తెలిపారు.

Advertisement

ఎక్కువ ఆఫ‌ర్ చేసినా నా రెమ్యున‌రేషన్ ఇంతే బ్ర‌దర్ అని చెప్పేవార‌ని అన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ నుండి కొంత‌మంది ఎన్టీఆర్ సీఎం అయ్యాక వెళ్లి క‌లిసామ‌ని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ రండి బ్ర‌ద‌ర్ భోజనం చేస్తూ కాల‌క్షేపం చేద్దామ‌ని పిలిచారని అన్నారు. తాము ఎన్టీఆర్ తో క‌లిసి క‌డుపునిండా భోజ‌నం చేశామ‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ ఐస్క్రీం తిందామా బ్ర‌ద‌ర్ అన్నార‌ని చెప్పారు.

ఇవి కూడా చదవండి:  ఎన్టీఆర్ తో స‌హా టాలీవుడ్ లో శ్రీ‌కృష్ణుడిగా న‌టించిన హీరోలు వీళ్లే..!

స‌రే అని చెప్ప‌డంతో ఓ పిల్లాడిని పిలిచి ఐస్క్రీం ల‌కు ఎంత డ‌బ్బు అవుతుందో చిల్ల‌ర లెక్క‌పెట్టి ఇచ్చార‌ని చెప్పారు. దాంతో తాను న‌వ్వుతూ 100 ఇస్తే చిల్ల‌ర తిరిగి తీసుకువ‌స్తాడు క‌దా సార్ అని అన్నాన‌ని తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఇది నేను క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు..డ‌బ్బు ఖ‌ర్చు చేసే విష‌యంలో నేను జాగ్ర‌త్త‌గా ఉంట‌న‌ని చెప్పార‌న‌న్నారు. అంతే కాకుండా బాల‌య్య పుట్టినప్పుడే కోటీశ్వ‌రుడు అని వ‌ర‌ద సాయం కోసం బాల‌య్య ద‌గ్గ‌ర‌కు వెళితే వెంట‌నే ల‌క్ష నో 2 ల‌క్ష‌లో ఇస్తాడ‌ని ఎన్టీఆర్ వ్యాఖ్యానించార‌ని తెలిపాడు. అలా ఎన్టీఆర్ బాల‌య్య ఖ‌ర్చుల విష‌యంలో ఆశ్చ‌ర్య‌పోయార‌ని ముర‌ళీమోహ‌న్ తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి : అభిమాని ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌.. ఆ త‌రువాత ఏం చేశారంటే..?

Visitors Are Also Reading