Home » ఒకప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసారా..?

ఒకప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసారా..?

by AJAY
Ad

బుల్లితెర టీవీ షోలో ఒక సంచలనంగా మారిన జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ కామెడీ షో ద్వారా సుదీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, రచ్చ రవి, హైపర్ ఆది లాంటి చాలామంది సినిమాలకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా సినిమాలతో పాటు ఇతర టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక వీరిలో చాలామంది ప్రస్తుతం జబర్దస్త్ ను వీడిన సంగతి తెలిసిందే. ఇక వీరిలో కొంతమంది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్ లు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ లు దిగిన ఫోటోలను ప్రదర్శించారు.

ఈ ఫోటోలలో ఒక్కొక్కరు ఎలాంటి స్థితి నుండి జబర్దస్త్ లోకి వచ్చారో చూపించారు. ఫోటోలలో హైపర్ ఆది ఫోటో ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా నూకరాజు భవన నిర్మాణ కార్మికుడిగా కనిపిస్తున్నాడు.

Advertisement

అంతేకాకుండా జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రోహిని సైతం ఈ ఫోటోలో ఉంది. ఆమె తన కాలేజీ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటో ను శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రదర్శించారు.

అదేవిధంగా ప్రస్తుతం జబర్దస్త్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కమెడియన్ ఇమాన్యుయేల్ ఒకప్పుడు తన రూమ్మేట్స్ తో కలిసి ఎలా ఉండేవాడు అన్నది ఫోటోలో చూపించారు. అదేవిధంగా గెటప్ శ్రీను కిచన్ లో తన వంట తానే వండుకునే ఫోటో ఒకదానిని ప్రదర్శించారు. గెటప్ శ్రీను సన్ని కూడా క్లోజ్ గా దిగిన ఫోటో ఒక దానిని ప్రదర్శించారు.

ALSO READ : “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో వెంకటేష్, మహేష్ బాబుల పేర్లు చిన్నోడా పెద్దోడా కాదు…అసలు పేర్లు ఇవే…!

Visitors Are Also Reading