Home » హీరోల‌కు మెగాస్టార్ సూప‌ర్ స్టార్ లాంటి బిరుదులు ఎలా వ‌చ్చాయి..? వాటి వెన‌క ఉన్న క‌థేంటి..?

హీరోల‌కు మెగాస్టార్ సూప‌ర్ స్టార్ లాంటి బిరుదులు ఎలా వ‌చ్చాయి..? వాటి వెన‌క ఉన్న క‌థేంటి..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌కు ఉన్న ప్రాధాన్య‌త మరెవ‌రికీ ఉండ‌దు. కోట్లు ఖ‌ర్చు పెట్టే నిర్మాత‌ల‌కు, క‌థ‌లు రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే దర్శ‌కులకు…హీరోలకు స‌మానంగా క‌ష్ట‌ప‌డి న‌టించే భామ‌లకు ఇలా ఎవ‌రికీ అంత క్రేజ్ ఉండ‌దు. కానీ హీరోల‌కు మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ప్రేక్ష‌కులు కూడా హీరోల‌ను చూసే సినిమాల‌కు వెళుతుంటారు.

Also Read:  ఎన్టీఆర్ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పునీత్ రాజ్ కుమార్..! ఆ సినిమా ఏదంటే..?

Advertisement

అయితే సినిమాలు ప్రారంభ‌మైన కొత్త‌లో హీరోల‌కు ఇంత క్రేజ్ ఉండేది కాదు. సినిమాలోని న‌టీన‌టులంద‌రికీ స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉండేది. కానీ కాల‌క్ర‌మేనా సినిమా అంటే ఒక్క హీరో మాత్ర‌మే అన్న‌ట్టుగా మారిపోయింది. అంతే కాకుండా 1975 త‌ర‌వాత కాలంలో హీరోలే సినిమాల‌కు పిల్ల‌ర్ అనేంత‌లా ప‌రిస్థితులు మారిపోయాయి. ఆ త‌ర‌వాత కాలంలో హీరో ఇండ్ర‌క్ష‌న్ లు హీరోల‌కు స్టార్ హీరో బిరుదులు కూడా వ‌చ్చాయి.

Also Read:  వ‌ర్షాకాలంలో ఈ కూర‌గాయ‌లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు..!

Advertisement

హీరోల‌కు పేరు చివ‌ర‌న స్టార్ అనే తోక‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌గిలించ‌డం మొద‌లుపెట్టారు. అక్కినేనికి త‌ప్ప మిగితా హీరోలంద‌రికీ బిరుదుల‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లే త‌గించారు. చిరంజీవిని మొద‌ట్లో సుప్రీ హీరో అని పిలిచేవారు. అది జనాల‌కు పెద్ద‌గా ఎక్కలేదు. ఆ త‌ర‌వాత మ‌ర‌ణ‌మృదంగం సినిమా టైటిల్ లో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి త‌గిలించారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని సుకుమార్ బిరుదు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో అప్ప‌టి వ‌ర‌కూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ గా పిల‌వ‌బ‌డుతున్నాడు. అంతే కాకుండా సూప‌ర్ స్టార్, క‌ళాత‌ప‌స్వి, రెబ‌ల్ స్టార్ మిగితా స్టార్ లు అన్నీ అలా వ‌చ్చిన‌వే. కానీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు మాత్రం 1957లో అప్ప‌టి మంత్రి బెజ‌వాడ‌గోపాల‌రెడ్డి న‌ట‌సామ్రాట్ అనే బిరుదును ఇచ్చార‌ట‌.

Also Read:  Chanakya Niti : ఇంటి పెద్ద‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఇవే..!

Visitors Are Also Reading