Home » ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ తాగితే వచ్చే ప్రమాదం ఏంటో మీకు తెలుసా..?

ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ తాగితే వచ్చే ప్రమాదం ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అనేది పెరిగిపోయింది. మనం బజారుకెళ్ళి రోజు ఏదో ఒకటి తింటూ ఉంటాం, లేదంటే చాయ్ తాగుతూ ఉంటాం. ఆ సమయంలో వారు మనకు తినడానికి ఇచ్చే ప్లేట్ కూడా ప్లాస్టిక్ తో తయారు చేసింది. చాయ్ కప్పు కూడా ప్లాస్టిక్ తో తయారు చేసింది. అలాంటి ప్లాస్టిక్ వాటిలో ఇలాంటి వేడి వేడి పదార్థాలు తింటే జరిగే అనర్ధాలు ఏమిటో ఓసారి చూద్దాం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉరుకుల, పరుగుల జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే వారు ఒత్తిడికి గురై కాస్త రిలీఫ్ కోసం టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు.

Advertisement

సాధారణంగా ఇంట్లో గాని మన ఆఫీస్ లో కానీ టీ ని గాజు గ్లాస్ లో తాగుతూ ఉంటాం. కానీ మనం మన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ పేపర్ కప్పులో టీ తాగుతూ ఉంటాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. నిజానికి పేపర్ కప్పులను ధర్మకోల్ తో తయారు చేస్తూ ఉంటారట. కానీ ప్రస్తుత కాలంలో పాలియస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్ తో ఈ కప్పులు తయారు చేస్తున్నారట. వేడివేడిగా ఉన్న టీ ఈ కప్పులో పోయే గానే వాటిలో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగి పోయి, ఆ టీలో కలిసిపోతాయి.

Advertisement

దీన్ని మనం తాగడం వల్ల దీర్ఘకాలిక రోగాలు, ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే అలసట, హార్మోన్ల అసమతుల్యత, చర్మానికి సంబంధించిన రోగాలు లాంటి అనేక సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతిని, చిన్న ప్రేవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందట. అందుకే పేపర్ కప్పు వద్దు.. గాజు, మట్టి గ్లాసులు ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

aslo read:

Visitors Are Also Reading