Home » IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

by Bunty
Ad

ఐపీఎల్ 2023 సీజన్ చాలా ఉత్కంగా ముందుకు సాగుతోంది. అయితే, ఈ టోర్నీ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో సిఎస్కే ను చిత్తు చేసింది. పిచ్ కండిషన్స్ కు తగ్గట్లు ఆడలేకపోయిన ధోనీ సేన ఓటమికి తలవంచింది.

Advertisement

అయితే ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ ను డేంజర్ జోన్ లో నిలబెట్టింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మే 20న జరిగే చివరి మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తెలపనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్… ధోనిని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది.

Advertisement

ఈ అద్భుతం సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. ధోని అభిమానానికి ముచ్చట పడిన సునీల్ గావస్కర్ స్వయంగా అతని వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్ గవాస్కర్ షర్టు ముందు భాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్ ఇవ్వడం, ఆ తర్వాత ధోనిని సునీల్ గావస్కర్ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Visitors Are Also Reading