Home » భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

by Bunty
Ad

 

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందని మొన్న పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. భీమ్లా నాయక్ సినిమాకు జగన్ 30 కోట్లు నష్టం కలిగించారని అబద్దాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా మార్కెట్ ఎంత?? పవన్ ఏమైనా పెట్టుబడి పెట్టాడా?? అని నిలదీశారు.

Advertisement

సినిమా బాగోకపోతే ప్రజలు ఎందుకు చూస్తారు?? ప్రభుత్వానికి, జగన్ కు ఏం సంబంధం ఉంటుంది?? అని నిలదీశారు. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారు.. చిరంజీవి వల్ల సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు కూడా ఎత్తటం లేదని పవన్ పై మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు.. రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాడు అని అగ్రహించారు.

Advertisement

తానొక్కడినే తెలివైన వాడిని అనుకుంటాడు.. జగన్ ను తిట్టడటం కోసమే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తుంటాడన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ డైలాగులు అని.. ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే వారాహి అని పేరు పెట్టాడు పవన్ అని చురకలు అంటించారు. ఏమయ్యింది ఆ వారాహి?? ప్రజలను, కాపులను కూడా కలిపి తిడు తున్నాడు.. పట్టుమని పది రోజులైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పని చేశాడా?? అని అగ్రహించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Visitors Are Also Reading