Home » కెప్టెన్సీ నిషేదం విషయంలో కీలక ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్.. భావోద్వేగ పోస్ట్ కు కారణం అదేనా ?

కెప్టెన్సీ నిషేదం విషయంలో కీలక ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్.. భావోద్వేగ పోస్ట్ కు కారణం అదేనా ?

by Anji
Published: Last Updated on
Ad

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రతీ ఒక్కరికీ తెలుసు. తాను క్రీజ్ లో ఉంటే స్కోరు పరుగులు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. డేవిడ్ వార్నర్ తనపై విధించిన కెప్టెన్సీ నిషేదం సమీక్ష కోసం చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నాడు. ఆ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా దృవీకరించాడు. 

Advertisement

ఈ తరుణంలో.. “ నాకు క్రికెట్ కంటే నా కుటుంబమే ముఖ్యం” అని డేవిడ్ వార్నర్ చెప్పాడు. తనపై ఉన్న నిషేదం విషయంలో తన తరుపున వాదించే లాయర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రివ్యూ ప్యానెల్ తనకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చాడు. “క్రికెట్ అనే డర్టీ లాండ్రీకి నా కుటుంబాన్ని వాషింగ్ మెషిన్ లా ఉంచేందుకు నేను సిద్ధంగా లేను”  అని వార్నర్ రివ్యూ ప్యానెల్ ను ఉద్దేశించి తాజాగా ప్రకటన రాసుకొచ్చాడు. తనను, తన కుటుంబాన్ని మరింత అవమానానికి గురి చేస్తామని ప్యానెల్ బెదిరించిందని.. తాను ఇకపై ప్రజల్లో భాగం కాకూడదని నిర్ణయించుకున్నానని వార్నర్ చెప్పుకొచ్చాడు.క్రికెట్ ఆస్ట్రేలియా వారి ప్రవర్తనా నియమావళిలో చేసిన మార్పుల తరువాత వార్నర్ తనపై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేదాన్ని అప్పిల్ చేయడానికి అనుమతి పొందాడు. పరిస్థితులు తనకు సహకరించలేదు. 

Advertisement

Also Read :  భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

 

వార్నర్ పై ఉన్న నాయకత్వ నిషేదాన్ని ఎత్తివేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ తనపై నిషేదం ఎప్పటికీ తొలిగిపోదు అని పేర్కొనడం గమనార్హం. రివ్యూ ప్యానెల్ తాను పంపిన ప్రతిపాదనను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా సమర్థించిందని వార్నర్ వెల్లడించాడు. తన కుటుంబం, సహచరులు మళ్లీ అవమానాలను ఎదుర్కోవాలని తాను కోరుకోనని, అందుకే తన అప్లికేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వార్నర్ తెలిపాడు.ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జట్టు తరుపు వెస్టిండిస్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. వార్నర్ ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేశాడు. 

Also Read :  షకీబ్ పై ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ.. ఎలాగో తెలుసా ?

Visitors Are Also Reading