Home » షకీబ్ పై ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ.. ఎలాగో తెలుసా ?

షకీబ్ పై ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ.. ఎలాగో తెలుసా ?

by Anji
Ad

టీమిండియా తాజాగా బంగ్లాదేశ్ లో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ భారత-బంగ్లా మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన అద్బుతమైన బ్యాటింగ్ తో యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్నాడు. మధ్యలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ గా కోహ్లీని పిలుస్తుంటారు. మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో  జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 15 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి షకిబ్ అల్ హాసన్ బౌలింగ్ లో లిటన్ దాస్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి వెనుదిరిగాడు.

Advertisement

బ్యాటింగ్ విఫలమైన విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్ లో మాత్రం అద్భుతమే చేసాడు. బౌలింగ్ లో 5 వికెట్లు తీసిన బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని సూపర్బ్ క్యాచ్ తో పెవిలియన్ దారి పట్టించాడు విరాట్ కోహ్లీ. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 24వ ఓవర్ మూడవ బంతికి షకీబ్ ఔట్ అయ్యాడు. సుందర్ ఆప్ స్టంప్ మీద షార్ట్ బాల్ వేయగా.. షకీబ్ దానిని కవర్ మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు. బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు షకీబ్. దీంతో ఆ బంతి ఎక్స్ ట్రా కవర్ దిశగా వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న విరాట్ కోహ్లీ తన కుడివైపునకు డైవ్ చేసి గాలిలో దూకి ఒంటిచేతితో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. కోహ్లీ క్యాచ్ చూసి షకీబ్ సైతం ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపు మైదానంలోనే బేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. కోహ్లీ బంగ్లా ఆల్ రౌండర్ క్యాచ్ పట్టగానే కోహ్లీత పాటు టీమిండియా ఆటగాళ్లందరూ సంబురాల్లో మునిగిపోయారు. షకీబ్ 38 బంతులు ఎదుర్కొని మూడు పోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు.

Advertisement

Manam News

ఇక ఈ మ్యాచ్ లో షకీబ్ 5 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లను ఔట్ చేశాడు. షకీబ్ తన కోటాలో 10 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. చివరి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్ లో టేయిల్ ఎండ్ బ్యాటర్లు బంగ్లా జట్టును విజయతీరాలకు నడిపించారు. 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. బంగ్లా బ్యాటర్లలో లిట్టన్ దాస్ (41), షకీబ్ అల్ హాసన్ (29), అనాముల్ (14), ముష్ ఫికుర్ రహీమ్ (18), మహ్మదుల్లా (14) పర్వాలేదనిపించారు. చివరలో మెహిడీ హాసన్ మిరాజ్ (37), ముస్తాఫిజుర్ రెహ్మన్ (10) పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ అంతా విఫలం చెందగా.. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ 73 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. కానీ కే.ఎల్. రాహుల్  ఓ క్యాచ్ మిస్ చేయడంతో ఇలా జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేయడం విశేషం.

Also Read :  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంత్ ని తీసుకోకపోవడానికి అసలు కారణం అదేనా ?

Visitors Are Also Reading