Home » భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

by AJAY
Ad

స్క్రీన్ పై ఒక హీరోని చూస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అదే ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానుల సంతోషం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒకప్పటినుండి మల్టీ స్టార్లర్ సినిమాలకు ఎంతో క్రేజీ ఉంది. ఇప్పటికి క్రేజ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో వచ్చిన కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయాయి. భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా నిలిచాయి… ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

Advertisement

రామ్ చరణ్ చిరంజీవి హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.

చిరంజీవి, శ్రీకాంత్ హీరోలుగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో శంకర్ దాదా జిందాబాద్ తెరకెక్కింది. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

Also Read:  వామ్మో.. శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా? ఆసక్తికరమైన విషయాలు రివీల్..!

15 years for Shankar Dada MBBS

సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు హీరోగా నటించిన సినిమా కృష్ణార్జునులు. ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరూ కూడా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. రామకృష్ణులు అనే సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు ముగ్గురు కలిసి నటించిన సినిమా సుల్తాన్. ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Also Read:  తెలుగు గ‌డ్డ‌పై పుట్టి… ఒక్క‌ముక్క కూడా తెలుగు రాయ‌డం చ‌ద‌వ‌డం రాని 10 మంది న‌టీన‌టులు వీళ్లే..!

Visitors Are Also Reading